తుమ్మ
తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.
| తుమ్మ | |
|---|---|
![]() | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | మాగ్నోలియోప్సిడా |
| క్రమం: | Fabales |
| కుటుంబం: | ఫాబేసి |
| ఉప కుటుంబం: | Mimosoideae |
| జాతి: | Acacieae |
| జాతి: | అకేసియా Philip Miller |
| జాతులు | |
|
About 1,300; see List of Acacia species | |
రకాలు
- అకేసియా అరాబికా - నల్ల తుమ్మ
- అకేసియా ల్యూకోఫ్లియా - తెల్ల తుమ్మ
- అకేసియా మెలనోజైలాన్ - ఆస్ట్రేలియా తుమ్మ
- అకేసియా ఫార్నెసియాన - నాగ తుమ్మ
- అకేసియా కెటచ్యు - కాచు
- అకేసియా కాన్ సిన్నా - సీకాయ
పెరిగే ప్రదేశాలు
ఇది ప్రాథమికంగా పాకిస్థాన్, లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారతదేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.
ఉపయోగాలు
- తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు, జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
- కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
- తుమ్మ చెట్టు నుండి జిగురు లభిస్తుంది.
- తుమ్మ ఆకులు జీలకర్ర, వాము కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
- రోజూ తుమ్మ బెరడును నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
- దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి, తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
- తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన టాన్సిల్స్ నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
- బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
- లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది.
- ఎండిన తుమ్మ చెట్టు కంపలను కంచెగా పంటపొలాలను పశువులనుండి రక్షించడానికి వేస్తారు.
చిత్రమాలిక
Acacia drepanolobium
Acacia sp.- తుమ్మముల్లు
సూచికలు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో తుమ్మచూడండి. |
యితర లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
