తిరువణ్ వండూరు

తిరువణ్ వండూరు భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువణ్ వండూరు
తిరువణ్ వండూరు
Location in Kerala
భౌగోళికాంశాలు :9°20′35″N 76°34′47″E
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పాంబణయప్పన్
ప్రధాన దేవత:కమలవల్లి త్తాయార్
దిశ మరియు స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:పాపనాశపుష్కరిణి
విమానం:వేదాలయ విమానము
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:మార్కండేయునకు, నారదునకు

విశేషాలు

ఈ క్షేత్రము నకులునిచే ప్రతిష్ఠ చేయబడినదని భావిస్తున్నారు. ఆళ్వార్లు అనేకవిధముల సర్వేశ్వరుని ప్రార్థించియు అభీష్టము లభింపక "దానికేమి కారణమని" ఆలోచించి "శ్రియ:పతి తిరువణ్ వణ్డూరులో ఉండి అచటి పూజలకు పరవశుడై తనను మరచి యుండు" నని భావించి స్వామియొక్క ఆర్తరక్షణ దీక్షను గుర్తుచేయదలచి సముద్రతీరమున సంచరించు పక్షులను శ్రియ:పతి యొద్దకు దూతలుగా పంపారు.

సాహిత్యం

శ్లో. వణ్ వండూర్ పురి పాపనాశ సరసా యుక్తేతు వేదాలయం
  వైమానం సమధిశ్రితో వరుణ దిగ్వక్త్ర స్థితి: ప్రీతిమాన్|
  దేవ: పాంబణయప్ప నంబుజలతా నాథ స్సముజ్జృంభతే
  మార్కండేయ సునారాదాక్షివిషయ: కీర్త్య:శఠద్వేషిణ:||

పాశురాలు

పా. వైకల్ పూజ్గழிవాయ్; వన్దుమేయు జ్గురుకినజ్గాళ్;
  శెయ్‌గొళ్ శెన్నలుయర్; తిరువణ్వణ్డూరుఱైయుమ్;
  కైగొళ్ శక్కరత్తైన్;కనివాయ్ పెరుమానై క్కణ్డు;
  కైగళ్ కూప్పి చ్చొల్లీర్; వినై యాట్టియేన్ కాదన్మైయే
  నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-1-1

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
పాంబణయప్పన్ కమలవల్లి త్తాయార్ పాపనాశపుష్కరిణి నిలచున్న భంగిమ పశ్చిమ ముఖము నమ్మాళ్వార్ వేదాలయ విమానము మార్కండేయునకు, నారదునకు

చేరే మార్గం

శెజ్గణూర్‌కు వాయువ్యముగా 5 కి.మీ. వసతులు స్వల్పము. తిరువల్లవాళ్ నుండియు సేవింపవచ్చును.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.