తిరుమాలిరుం శోలై మలై

తిరుమాలిరుం శోలై మలై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుమాలిరుం శోలై మలై
తిరుమాలిరుం శోలై మలై
Location in Madurai
భౌగోళికాంశాలు :10.074136°N 78.214356°E / 10.074136; 78.214356
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సుందర బాహు పెరుమాళ్,
ప్రధాన దేవత:అళగర్ (మూలామూర్తి) సుందరవల్లి తాయార్, కళ్యాణవల్లి తాయార్
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
విమానం:సోమసుందర విమానము
కవులు:పూదత్తాళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆణ్డాళ్, తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:ధర్మదేవతకు మలయధ్వజ పాండ్యరాజునకు

విశేషాలు

ఈ క్షేత్రమునము దక్షిణ తిరుపతి అని, వనగిరి అని ఇతర పేర్లు ఉన్నాయి. ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో ఉంటారు. మూలవర్‌కు వైకుంఠ నాథన్, పరమ స్వామి అనే తిరునామములు ఉన్నాయి. స్వామి సుదర్శన చక్రహస్తులై వేంచేసియున్నారు.

ఈ క్షేత్రస్వామికి ఆండాళ్ "నాఱు నాట్రుంపోళ్ " అను పాశురమున స్వామికి నూరు గంగాళముల అక్కారవడిశల్(పాయసాన్నము), నూరు గిన్నెలతో వెన్న ఆరగింపుచేతునని మాట యిచ్చింది.

పిమ్మట భగవద్రామానుజులు అవతరించి ఆండాళ్ ఇచ్చిన మా తా సఫలం చేయాలని నూరు గంగాళముల అక్కారపడిశల్, వెన్న ఆరగింపుచేసి పిమ్మట ఈ విషయమును ఆండాళ్ సన్నిధిలో విజ్ఞాపన చేసాడు. ఆండాళ్ సంతుష్టాంత రంగులై ఉడయవరులను జూచి "ఎన్ కోయిల్ అణ్ణనే" అని పిలిచి ఆదరించి గౌరవించిందట. అది మొదలు ఉడయవర్లకు "గోదాగ్రజ:" అనియు "కోయిల్ అణ్ణన్" అని పేర్లు వచ్చాయి. ఇచట ఆండాళ్ "వీట్రిరుంద తిరుక్కోలముతో(కూర్చున్న భంగిమ) ప్రతిష్టితమై ఉంది.

ఈక్షేత్రమునకు "మయల్ మిగు పొళిల్"(తిరువాయ్ మొళి 2-10-3)(దట్టమై తోటలుగల దివ్యదేశము) అను విశిష్టమైన తిరునామము ఉంది. తిరుమంగై ఆళ్వార్ ఈక్షేత్రస్వామిని "తెన్నానై" (తెఱ్కే ఆనై) దక్షిణ దిగ్గజముగా అభివర్ణించారు. ఈక్షేత్రస్వామికి కళ్ళళగర్ అను మరొక పేరు ఉంది. నమ్మళ్వార్లు "శొ-ఱ్కవిగాళ్" అని తిరువాయి మొళిలో "నె-ముయిరుముళ్ కలన్దు" (మనస్సు నందును ప్రాణము నందును కలసిపోయి) అని సర్వేశ్వరుని "ఆశ్రిత వ్యామోహమనెడి గుణమును అభివర్ణించింది. నమ్మాళ్వార్ల భక్తికి పరవశుడైన సర్వేశ్వరుడు ఆళ్వార్లను వీడలేక వారి తిరుమేని యందు మిక్కిలి ప్రీతిని చూపగా ఆళ్వార్లు "అయ్యో! సర్వేశ్వరుడు నన్ను ఈ దేహముతోనే పరమపదమునకు తీసికొని పోవునేమో! అట్లైన ఈ సంసారము నిత్యమగునే!" యని తలచి సర్వేశ్వరుని ప్రార్థించి ఈ దేహముపై మోహమును విడువమని ప్రార్థింపగా స్వామి యట్లేయని యంగీకరించెను. అపుడు ఆళ్వార్లు "ఆహా! ఏమి సర్వేశ్వరుని శీలగుణము, ఆశ్రిత వ్యామోహము" అని ఆశ్చర్యపడి ఆ ఆశ్రిత వ్యామోహమును "శొ-ల్‌కవిగాళ్" అను దశకమున ప్రకటించుచున్నారు.

ఈ సన్నిధి చాలా విశాలమైంది. దీనికి అళగర్ కోట యని పేరు. సన్నిధికి ఉత్తరముగా కొండపై నూపుర గంగ కలదు. సన్నిధి గోపురద్వారమున 18వ పడి గట్టులో "కరుప్పణన్" సన్నిధికి కావలిగా ఉంటాడు. స్వామిసన్నిధి తాళము వేసిన పిమ్మట ఆ తాళములను వీరి సన్నిధిలో ఉంచుతారట.

బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వార్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేస్తారు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేస్తారు.

మేషం పౌర్ణమినాడు ఏటి ఉత్సవమునకు పెరుమాళ్లు వేంచేయగా తాయార్లకు కోపము వచ్చినదట. ఆకారణమున నాడు మొదలు బ్రహ్మోత్సవము వరకు సన్నిధి ప్రాకారములో గల ఒక మండపములో వేంచేసి ఆవారాదన అందుకుంటుంది.

ఉత్సవములు

మేషమాసములో పౌర్ణమినాడు మధురలో గల వైగైనదిలో ఏటి ఉత్సవము జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై శ్రీకూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవముననుగ్రహించిరి.

కర్కాటక మాసములో బ్రహ్మోత్సవము జరుగును. పలు సత్రములు సన్నిధి సమీపములో ఉన్నాయి. సన్నిధిలో ప్రసాదము లభించును. అన్ని వసతులు గల క్షేత్రము.

సాహిత్యం

శ్లో|| శ్రీమద్వనాద్రి పథ నూపుర నిమ్నగాంతే
  దేశేస్థితో వృషభ పర్వత చందనాఢ్యే |
  ధర్మేక్షితస్తు మలయధ్వజ పాండ్య దృష్టః
  ప్రాగాసనో లసతి సుందరబాహు నాథః ||

శ్లో|| సోమసుందర విమాన మథ్యగః సుందరోప పద వల్లికాయుతః |
  విష్ణుచిత్త కలిజిత్ పరాంకుశైః గోదయా మణి మహర్షిణాస్తుతః ||

పాశురాలు

పా. కిళరొళి యిళమై కెడువదన్ మున్నమ్‌,
  వళరొళి మయోన్ మరువియ కోయిల్,
  వళరిళమ్‌ పొழிల్ శూழ் మాలిరు-లై
  తళర్విలరాగిల్ శార్వదు శదిరే.
  నమ్మాళ్వారు-తిరువాయి మొழி 2-10-1

పా. అలమ్బా వెరుట్టా క్కొన్ఱు తిరియు మరక్కరై
  క్కులమ్బాழ் పడుత్తు క్కులవిళక్కాయ్ నిన్ఱకోన్ మలై,
  శిలమ్బార్‌క వన్దు తెయ్‌వ మకళిర్‌కళాడుమ్‌.శీర్
  చ్చిలమ్‌పాఱు పాయుమ్‌ తెన్ మాలిరుమ్‌ శోలైయే.
  పెరియాళ్వారు-పెరియాళ్వారు తిరుమొழி 4-2-1

పా. నాఱు నఱుమ్బొழிల్ మాలిరుం శోలై నమ్బిక్కు, నాని
  నూఱు తడావిల్ వెణ్ణెయ్ వాయ్ నేర్‌న్దు పరావివైత్తేన్,
  నుఱు తడానిరైన్ద అక్కారవడిశల్ శొన్నేన్,
  ఏఱు తిరుపుడైయా నిన్ఱు వన్దివై కొళు జ్గొలో.
  ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 9-6

పా. మున్దుఱవురై క్కేన్ వరై క్కుழల్‌మడవార్ కలవియై విడుతడుమారల్
  అన్దరమేழு మలై కడలేழு మాయ వెమ్మడిగళ్ తమ్‌ కోయిల్
  శన్దొడు మణియు మణిమయిల్ తழைయున్దழுవి వన్దరువిగళ్ నిరన్దు
  వన్దిழி శారల్ మాలిరు-లై వణబ్గుదుమ్‌ వామడనె--.
  తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 9-8-1

పా. నేశమిలాదవర్‌క్కుమ్‌ నినై యాదవర్‌క్కు మరియాన్
  వాశమలర్ పొழிల్ శూழ் వడమా మదుఱైప్పిఱన్దాన్
  దేశమెల్లామ్‌ వణజ్గు న్దిరుమాలిరుమ్‌ --లైనిన్ఱ
  కేశవనమ్బిదన్నై క్కెణ్డై యొణ్ కణ్ణి కాణుజ్గొలో.
 
పా. వలమ్బురి యాழிయనై వరైయార్ తిరడోళన్ఱన్నై
  పులమ్‌పురి నూలవనై ప్పొழிల్ వేజ్గడ వేదియనై
  శిలమ్బియలాఱుడైయ తిరుమాలి--లైనిన్ఱ
  నలన్దిగழ் నారణైనై నణుగుజ్గో లెన్నన్నుదలే.
  9-9-1,6,9.

శ్లో. పీతామ్బరం వరద శీతల దృష్టిపాతం
  ఆజానులమ్బి భుజ మాయత కర్ణపాశమ్‌
  శ్రీమన్మహా వనగిరీన్ద్ర నివాస దీక్షం
  లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు
  శ్రీకూరత్తాళ్వాన్-సుందరబాహుస్తవమ్‌ 14 శ్లో.

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు స్థల వృక్షం శిల విమానం ప్రదేశం ప్రత్యక్షం
సుందర బాహు పెరుమాళ్ అళగర్ (మూలామూర్తి) సుందరవల్లి తాయార్, కళ్యాణవల్లి తాయార్ తూర్పు ముఖము నిలుచున్న భంగిమ పూదత్తాళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆణ్డాళ్, తిరుమంగై ఆళ్వార్ చందన వృక్షము నూపురగంగ (శిలమ్బార్చబడింది) సోమసుందర విమానము వృషభగిరి ధర్మదేవతకు మలయధ్వజ పాండ్యరాజునకు

చేరే మార్గం

మధురకు 15 కి.మీ దూరము.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.