తిరుత్తణ్ గా

తిరుత్తణ్ గా భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుత్తణ్ గా
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:దీపప్రకాశర్
ప్రధాన దేవత:మరకతవల్లిత్తాయార్
దిశ మరియు స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:సరస్వతీ తీర్థం
విమానం:శ్రీకర విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:సరస్వతీదేవికి

విశేషాలు

శ్రీమద్వేదాంతదేశికులు జన్మస్థానమిది. ఆయన శరీరం ఇచట ఉంది. దేశికర్ పూజించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవుల సన్నిధి ఇక్కడ ఉంది. ఈ స్వామిని కీర్తిస్తూ నిగమాంత మహాదేశికులు దేహలీశస్తుతి-శరణాగత దీపికా రచించాడు.

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
దీపప్రకాశర్ మరకతవల్లిత్తాయార్ సరస్వతీ తీర్థం పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ శ్రీకర విమానము సరస్వతీదేవికి

సాహిత్యం

శ్లో. శ్రీతణ్‌కా నగరే విళాక్కొళి విభు స్తీర్థం తు సారస్వతం
  ప్రాప్త శ్శ్రీకర దేవయాన నిలయ: పశ్చాన్ముఖాబ్జ స్థితి:|
  దేవీం మారతకోవ పూర్వలతికాం ఆలింగ్య వేధ:ప్రియాం
  ప్రత్యక్ష:కలిజిన్నుతో విజయతే దీప ప్రకాశాభిద:||

పాశురాలు

పాశురం.
ముళైక్కదిరై క్కుఱుజ్గుడియుళ్ ముగిలై మూవా;మూవులగమ్‌ కడన్దప్పాల్ ముదలాయ్ నిన్ఱ;
అళప్పరియ వారముదై యరజ్గమేయ;వన్దణనై యన్దణర్ దమ్‌ శిన్దై యానై;
విళక్కొళియై మరదగత్తై త్తిరుత్తణ్ కావిల్; వెஃకావిల్ తిరుమాలై ప్పాడక్కేట్టు;
వళర్‌త్తదనాల్ పయన్ పెత్‌తేన్ పరుగ నెన్ఱు; మడక్కిళియైక్కైకూప్పి వణజ్గి నాళే.
  తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 14.

చేరే మార్గం

కాంచీపురం అష్టభుజం సన్నిధికి 1/2 కి.మీ దూరములోనున్నది.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.