తిరుచ్చేరై

తిరుచ్చేరై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. నిలచున్న భంగిమ

తిరుచ్చేరై
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సారనాథ పెరుమాళ్
ప్రధాన దేవత:సారనాయకి
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:సార పుష్కరణి
విమానం:సార విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:కావేరికి ప్రత్యక్షము

వివరాలు

పుష్కరిణి తీరమున కావేరి అమ్మన్ సన్నిధి ఉంది. మకరమాసములో జరుగు రధోత్సవమున పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సారనాయకి మహాలక్ష్మి వీరితో కలిసి ఉంటాడు.

సాహిత్యం

శ్లో. శ్రీ సారాఖ్య సరోజనీ కృతరుచౌ సారాభిధానే పురే
  సారాఖ్యాయుత నాయకీ ప్రియ వపు స్సారాఖ్య వైమానగ:|
  ప్రాగ్వక్త్రాంబుజ సంస్థితి ర్విజయతే శ్రీ సారనాథో విభు:
  కావేరి నయనా తిథి: కలిరిపు స్తుత్య శ్శ్రితాభీష్టద||

పాశురం

  కణ్‌శోర వెజ్గురుది వన్దిழிయ వెన్దழల్‌పోల్ క్కున్దలాళై
  మణ్‌శేర ములై యుణ్డ మామదలాయ్ వానవర్ తజ్కోవే యెన్ఱు
  విణ్ శేరు మిళన్దిజ్గళగడురిఇజ మణిమాడమల్‌గు; శెల్వ
  త్తణ్ శేఱైయెమ్బెరుమాన్ తాళ్ తొழுవార్ కాణ్మినెన్ఱలై మేలారే !
  తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 7-4-1

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
సారనాథ పెరుమాళ్ సారనాయకి సార పుష్కరణి తూర్పు ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ సార విమానము కావేరికి ప్రత్యక్షము

విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములు

భగవంతుని ప్రాకృత పుష్పములతో పాటు ఈ పుష్పముల తోడను పూజింపవలెను.

1. అహింసా. 2. ఇంద్రియ నిగ్రహము. 3. సర్వ భూత దయ. 4. క్షమా. 5. జ్ఞానము. 6. తపస్సు. 7. ధ్యానము. 8. సత్యము.

ఈ ఎనిమిది విష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు

శ్లో. అహింసా ప్రధమం పుష్పమ్‌-పుష్ప మింద్రియ నిగ్రహ:
  సర్వభూతదయా పుష్పం-క్షమా పుష్పం-విశేషత:
  జ్ఞానం పుష్పం-తప: పుష్పం-ధ్యానం పుష్పం తదైవ చ
  సత్య మష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతి కరం భవేత్||

చేరే మార్గం

కుంభఘోణము నుండి కూడవాశల్ పోవు టౌన్‌బస్‌లో 12 కి.మీ. దూరమున గలదు. సత్రములు హోటళ్లు గలవు. ఉప్పిలియప్పన్(తిరువిణ్ణగర్) సన్నిధి నుండి ,నాచ్చియార్ కోయిల్ నుండియు కూడ పోవచ్చును. ఈ క్షేత్రమునకు 5 కి.మీ నాచ్చియార్ కోయిల్.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.