తిరుక్కావళంబాడి


తిరుక్కావళంబాడి (Thirukkavalampadi) లేదా తిరునాంగూర్ తిరుపతి ప్రముఖమైన 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ గోపాలకృష్ణ పెరుమాల్ దేవాలయం ప్రసిద్ధిచెందినది.

శ్లో|| పృధు పుష్ప సరో రమ్యే కావళంబాడి పట్టణే |
స్వయంభు వర వైమాన స్థాయీం శెంగమలాభిధామ్‌ ||

శ్లో|| నాయకీ మాశ్రితశ్శ్రీవ న్ ప్రాజ్ముఖో రుద్ర సేవితః |
గోపాలకృష్ణ భగవాన్ రాజతే కలిజిన్నుతః ||

తిరుక్కావళంబాడి
తిరుక్కావళంబాడి
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :11.16°N 79.8°E / 11.16; 79.8
పేరు
ఇతర పేర్లు:గోపాలకృష్ణ పెరుమాల్ దేవాలయం
ప్రధాన పేరు :తిరుక్కావళంబాడి
ప్రదేశము
దేశము:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:నాగపట్నం
ప్రదేశము:తిరునాగూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:గోపాలకృష్ణ పెరుమాల్
(విష్ణుమూర్తి)
ప్రధాన దేవత:శెంగమల తాయార్
(లక్ష్మీదేవి)
దిశ మరియు స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:తడమలర్ పొయిగై పుష్కరిణి
విమానం:స్వయంభూ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:రుద్రుడు
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

విశేషాలు

తిరుమంగై ఆళ్వార్ జన్మస్థానమైన తిరుక్కుఱైయలూర్. తదీయారాధన చేసిన మంగై మఠము సమీపమున ఉన్నాయి. మంగ మఠములో శ్రీ వీర నరసింహస్వామి సన్నిధి ఉంది. అర్చకులు కీళ్ చాలైలో ఉంటారు.

మార్గము

తిరుత్తేవనార్ గొగైకు 1 కి.మీ. దూరములో ఈ క్షేత్రము ఉంది.

భగవత్ప్రాప్తి

" మూడు జన్మలు(హిరణ్యకశిప, రావణ, శిశుపాల) భగవంతునితో శతృత్వం వహించి జన్మించిన శిశుపాలుడు చివరకు భగవంతుని చేరుకున్నాడు. అనాది కాలముగా అనేక జన్మ పరంపరలలో భగవంతునితో శతృత్వం వహించి అపచారము చేయుచున్న మనము సర్వేశ్వరుని పొందకపోదుమా! " కురుగూరునంబిగారు అభిప్రాయం.

తమిళ సాహిత్యం

పా|| తావళన్దులగమళమ్‌ తడమలర్ ప్పొయ్‌గై పుక్కు
నావళ నవిన్ఱజ్గేత్త నాగత్తిన్ నడుక్కమ్‌ తీర్తాయ్
మావళమ్‌ పెరుగి మన్నుమఱైయవర్ వాళమ్‌, నాజ్గైక్
కావళమ్బాడిమేయ కణ్ణనే కళైగఱియే.

పా|| శన్దమాయ్ చ్చమయమాగి చ్చమయవైమ్బూదమాగి;
అన్దమాయాదియాగి యఱుమఱైయలైయు మానాయ్
మన్దమార్ పొళిల్‌కడోఱుమ్‌ మడమయిలాలు నాజ్గై
కాన్దనూర్ కావళన్దణ్ పాడియాయ్ కళైగణీయే
తిరుమజ్గై యాళ్వార్- పెరియ తిరుమొళి 4-6-9

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
గోపాలకృష్ణన్ శెంగమలవల్లి, మదనగర్ మంగై నాచ్చియార్, తడమలర్ పొయిగై పుష్కరిణి తూర్పుముఖము నిలుచున్నభంగిమ తిరుమంగై ఆళ్వార్ స్వయంభూ విమానము రుద్రునకు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    మూలాలు

      వెలుపలి లింకులు

      This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.