తిరుక్కారగమ్

తిరుక్కారగమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. - నిలచున్న భంగిమ

తిరుక్కారగమ్
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: కరుణాకర పెరుమాళ్
ప్రధాన దేవత: పద్మామణి త్తాయార్
దిశ మరియు స్థానం: దక్షిణ ముఖము
పుష్కరిణి: అక్రాయ పుష్కరిణి
విమానం: వామన విమానము
కవులు: తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం: కారక మహర్షికి

విశేషాలు

విశే: ఈ సన్నిధి ప్రత్యేకముగా లేదు. ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధిలో తాయార్ సన్నిధికి ఎదురుగా నున్నది.

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కరుణాకర పెరుమాళ్- పద్మామణి త్తాయార్ అక్రాయ పుష్కరిణి దక్షిణ ముఖము తిరుమంగై ఆళ్వార్ నిలచున్న భంగిమ వామన విమానము కారక మహర్షికి

సాహిత్యం

శ్లో. అక్కిరాయ సరోరమ్యే కారకాఖ్యాన పట్టణే|
  మద్మామణి రమానాథ:కమలాకర నాయక:||
  వామనం ప్రాప్య వైమానం దక్షిణాముఖ సంస్థిత:|
  కారకర్షి తపోలబ్ధ రాజతే కలిజిన్నుత:||

పాశురాలు

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
  నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
  ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
  ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుం
  కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
  కామరుపూజ్కావిరియిన్ తెన్బాల్ మన్ను
  పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
  పెరుమామన్ తిరువడియే పేణినేనే.
  తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8

మంచిమాట

ఒకప్పుడు నంజీయర్ అను ఆచార్యులు అనారోగ్యం బారినపడ్డాడు. ఆయనకు ప్రాణాపాయము తప్పదని అందరు అనుకుంటున్న సమయంలో "కుట్టక్కుడి యిళైయాళ్వార్" అనువారు వారి దగ్గరకు వెళ్ళి ఈ సమయమున ఆత్మకు హితమైన ద్వయమంత్రమును అనుసంధానము చేయరాదా! అని చెప్పారు. అది విని నంజీయర్ " మంచములో పడియున్న నాకు మాత్రమే అవసరమా! ఇంకను ఈ లోకములో తిరిగే మీకు అవసరములేదా! " అని సమాధానం ఇచ్చాడు. అందువలన ఇహలోకయాత్ర చేసేవారికి పరమపదయాత్ర చేయువారికిని హితమైనది ద్వయమంత్రము మాత్రమే. అని ఆళ్వారుల అభిప్రాయం.

చేరే మార్గం

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.