తిరుక్కడిత్తానమ్

తిరుక్కడిత్తానమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుక్కడిత్తానమ్
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: అద్బుత నారాయణన్
ప్రధాన దేవత: కల్పకవల్లి త్తాయార్
దిశ మరియు స్థానం: తూర్పు ముఖము
పుష్కరిణి: భూమి పుష్కరిణి
విమానం: పుణ్యకోటి విమానము
కవులు: నమ్మాళ్వార్లు
ప్రత్యక్షం: రుక్మాంగద మహారాజునకు

విశేషాలు

ఈక్షేత్రమునకు "తాయప్పది" దాయభాగముగా లభించిన క్షేత్రము అను విలక్షణమైన తిరునామము గలదు. (తి.వా.మొ.8-6-8)

సర్వేశ్వరునకు భోగ్య భూతములైన వాస స్థానములు అనేకములు ఉన్నాయి. కానీ "శ్రీవైకుంఠవిరక్తాయ" అనురీతిని వానియందు ఆదరములేనివాడు "ఎన్నైజ్గుమ్‌ తిరుక్కడిత్తన నగరుమ్" (8-6-8) (నామనస్సు తిరుక్కడిత్తాన దివ్యదేశము) అనునటుల నా హృదయమునందు వాసము చేయుచున్నాడు. అంతేకాక అందుకు కారణమైన తిరుక్కడిత్తాన క్షేత్రమున వేంచేసియున్నాడు. ఈ రెండును స్వామికి దాయప్రాప్తములుగదా!" అని ఆళ్వార్లు సర్వేశ్వరుని కృతజ్ఞతా గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రము సహదేవునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. చిన్న గ్రామము. సమీపమందలి శెంగనాంచేరిలో మకాంచేయవలెను. లేక తిరువల్లవాழ் నుండి పోవచ్చును

సాహిత్యం

శ్లో. తిరుక్కడిత్తాన పురే ద్బుతాఖ్య నారాయణ: కల్పక వల్లి దేవ్యా|
  భూమ్యాఖ్య తీర్థే వరపుణ్యకోటి విమానమాప్త: సురదిజ్ముఖస్థ:||
  రుక్మాంగద మహారాజ ప్రత్యక్షత్వ ముసాగత:|
  పరాంకుశ మునీంద్రేణ స్తుతో విజయతే తరామ్‌||

పాశురాలు

పా. తాన నగర్ గళ్; తలైచ్చిఱన్దెజ్గెజ్గుమ్;
  వానిన్నిలమ్‌ కడల్; ముత్‌త్తు మెమ్మాయఱ్కే;
  ఆనవిడత్తు; మెన్నై--మ్‌ తిరుక్కడిత్
  తాననగరుమ్; తన తాయప్పదియే.
  నమ్మాళ్వారు-తిరువాయిమొழி 8-6-8

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
అద్బుత నారాయణన్ కల్పకవల్లి త్తాయార్ భూమి పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న భంగిమ నమ్మాళ్వార్లు పుణ్యకోటి విమానము రుక్మాంగద మహారాజునకు

చేరే మార్గం

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.