తాళ్ళపాక తిరువెంగళనాధుడు
తాళ్ళపాక తిరువెంగళనాధుడు నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈ కవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈ గ్రంథరచన బట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు తాళ్ళపాక అన్నమయ్య యొక్క మనుమడు. మరియు తిరుమలార్యుని కుమారుడు అయినట్టు గ్రంథారంభము లోని యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-
ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
- వరవంసభవ భరద్వాజగోత్ర
- పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య
- ధీవిశారదసూను తిరుమలాచార్య
- వినుతనందను దిరువేంగళనాధు.
- వరవంసభవ భరద్వాజగోత్ర
ఈకవితాత యైనయన్న యార్యుడు కృష్ణదేవరాయనికాలములో నుండి కొన్నియగ్రహారముల నందెను. కవి తనకు వేంకటాద్రిరాయలు కుండలములు వేసినట్లు తనగ్రంథములోని యెనిమిదవయాశ్వాసాంతము నందీవాక్యములచే జెప్పుకొన్నాడు.
ద్వి. అతిలోకమతికి శేషాచలరాజ
- పతికి బరాముఖ్య భక్తసంతతికి
- నంకితంబుగను శ్రీహరిభక్తనికర
- పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య
- తనయ తిమ్మార్య నందన రత్నశుంభ
- దనవమ శ్రీవేంకటాద్రీశ దత్త
- మకరకుండలయుగ్మ మండితకర్ణ-
- పతికి బరాముఖ్య భక్తసంతతికి
కవి కాలాదులు నిర్ణయము
ఈకవికి మకరకుండలములువేసిన వేంకటాద్రిసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయని తమ్ముడని తోచుచున్నది. అట్లే యైన పక్షమున కవి 1570 వ సంవత్సరప్రాంతములయం దుండెను. అట్లు గాక యతడు తిరుమలదేవరాయని కొడుకైన వేంకటాద్రి యైనపక్షమున, అతడు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసినందున కవియు నాకాలమువాడే యయి యుండవలెను. కవియొక్క కవిత్వరీతి తెలియుటకయి ద్వితీయాశ్వాసమునుండి కొంచెముభాగ ముదాహరించ బడింది.
ద్వి. భానుకోటిస్ఫూర్తి బ్రహసించుచున్న
- మౌనినందను గాంచి మది సంతసించి
- పిల్లిగా దోరి జాబిల్లి గాబోలు
- జల్లనివెన్నెల జల్లుచున్నాడు;
- అనుచు నబ్బాలు ఱెప్పార్ప కెంతయును
- గనుగొని వేడుకకడలి నోలాడి
- యానందబాష్పంబు లాననాబ్జంబు
- మైనుండి దిగువార మై గరుపార
- బెన్నిధి గన్నట్టిపేదచందమున
- నున్నతోన్నతు డైనయోగినందనుని
- దనయులు లేని యాదరమున నెత్తి
- కొని కూర్మితోడ నక్కున జేర్చి వేడ్క
- గొనకొని యావేత్రకుంజంబు వెడలి
- తనవార లెల్ల నెంతయు జోద్యపడగ
- మునిపుత్రుగొని పురంబున కేగుదెంచి
- తనయాలిచేతి కెంతయు బ్రేమ నొసగె.
- మౌనినందను గాంచి మది సంతసించి
మూలాల జాబితా
- ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [తాళ్ళపాక తిరువెంగళనాధుడు]