తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
తంగెళ్ళశ్రీదేవి రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. నవలలతో పాటు, కథలు, కవితలు రాశారు. వీరు రచించిన నవలలు, కథలు అనేక ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. నేటి వనపర్తి జిల్లాలోని ఒక మండల కేంద్రమైన ఆత్మకూర్ వీరి స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు.
| తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి | |
|---|---|
![]() | |
| జననం | ఆత్మకూర్, వనపర్తి జిల్లా |
| చదువు | ఎం. ఎ, తెలుగు |
| విద్యాసంస్థలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు |
| వృత్తి | రచయిత, తెలుగు ఉపన్యాసకురాలు |
| తల్లిదండ్రులు |
|
కుటుంబ నేపథ్యం
తల్లి తంగెళ్ళ సుజాత, తండ్రి తంగెళ్ళ శ్రీనివాస్ రెడ్డి.
విద్యాభ్యాసం
స్వస్థలమైన ఆత్మకూరులో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి. ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. అక్కడే తెలుగు వార పత్రికలు- సాహిత్య వికాసం అను అంశంపై పరిశోధన చేసి, పిహెచ్.డి పట్టాను పొందారు.
వృత్తి
వీరు తెలుగు ఉపన్యాసకులు. ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన ఆచార్య జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రానికి సంబంధించి ఎం. ఏ. తెలుగు పాఠ్యపుస్తకాల రూపకల్పన బృందంలో వీరు సభ్యులుగానూ పనిచేశారు.
రచనలు
ఇప్పటి వరకు వీరు 7 నవలలు, సుమారు 50 దాక కథలు, అనేక కవితలు, వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. వీరి నవలలు స్వాతి, చతుర వంటి మాస పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కథలు వివిధ దిన, వార పత్రికలలో ప్రచురించబడినవి. రచయితలకు కులం మతం ప్రాంతం లేదన్నది వీరి అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే వీరు తెలంగాణకు చెందిన వారైనా, ఆంధ్ర ప్రదేశ్ కు దక్కవలసిన ‘ప్రత్యేక హోదా’ అంశంపై సాగుతున్న ఉద్యమానికి ఊతంగా ఈమె పాటలు రచించారు. అవి ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యం పొందాయి.
- నవలలు
మూలాలు
అవార్డులు
శ్రీదేవి రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే 'కీర్తి పురస్కారాలకు ఎంపికైంది. 2015 సంవత్సరానికి సంబంధించి ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. తెలంగాణ శాసన సభ స్పీకరు మధుసూదనాచారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 'వాసిరెడ్డి రంగనాయకమ్మ ' స్మారక అవార్డును కూడా వీరు పొందడం జరిగింది.
మూలాలు
- స్వాతి, సచిత్ర మాస పత్రిక, సెప్టెంబర్,2000
- చతుర, మే -2000
- విద్యుల్లత, మాసపత్రిక,ఏప్రిల్,2008.
- చతుర,మార్చి,2002
- చతుర, జూలై, 2003.
- ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక -20.11.2008,
- ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక -09.11.1995.

