డిసెంబర్ 31
డిసెంబర్ 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 365వ రోజు (లీపు సంవత్సరములో 366వ రోజు ). ఇది సంవత్సరములో చివరి రోజు.
| << | డిసెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 2010: ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.
- ఈరోజు ప్రపంచ తాగుబోతుల దినోత్సవం
జననాలు

- 1870: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (మ.2017)
- 1907: కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)
- 1918: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, ప్రముఖ సాహితీవేత్త.
- 1928: కొంగర జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004)
- 1937: ఆంథోనీ హాప్కిన్స్, నటుడు.
- 1947: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. (మ.2009)
- 1953: ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.
- 1964: విన్స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1965: లక్ష్మణ్ శివరామకృష్ణన్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1977: సుచేతా కడేత్కర్, సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.
- 1979: మలింగ బండార, శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు.
- 1988: వడ్ల అనిల్ కుమార్ చారి, సింగీతం గ్రామ నివాసి.
మరణాలు
- 1900: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)
- 1965: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి.(జ.1893)
- 2004: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
పండుగలు మరియు జాతీయ దినాలు
- ఈరోజు ప్రపంచ తాగుబోతుల దినోత్సవంగా జరుపుకుంటారు.
ఎందుకంటే ఈ డిసేంబర్ నెల సంవత్సరంలోనే లాస్ట్ నెల. పైగా లాస్ట్ రోజు. 31వ రోజుతో సంవత్సరం ఐపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అన్న ఆనందంలో మద్యం తాగడం అలవాటు ఉన్నవాల్లందరు ఫుల్ గా తాగుతారు. తాగడం అలవాటు లేని వాల్లు ఈరోజు కొత్తగా నేర్చుకుంటారు. కేవలం ఈ ఒక్క రోజే సంవత్సరం మొత్తం మీద ఎంత మద్యం అమ్ముతారో... అంత మద్యం అమ్ముతారు. ప్రతీ గవర్నమెంట్ కి ఈరోజే ఫుల్ ఆదాయం వస్తుంది. 31నైట్ 12కి ప్రతీ ఒక్కరి ఇంట్లో కేకులు కట్ చేస్కుంటారు. అదేరోజు రాత్రి నుండి అందరు చాలా బీజీగా షాపింగ్స్ చేస్థూ కొత్త బట్టలు, కేక్స్, కూల్ డ్రింక్స్, బిర్యాని, స్వీట్స్ కొంటారు. డిసేంబర్ 31 రాత్రి నుండి తెల్లరి జనవరి 1వ రోజంతా అందరూ కలిసిన వాల్లకి షేక్ హాడ్ ఇస్థూ... హగ్ చేస్కుంటూ కలవలేని వాల్లకి సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ట్విటర్, యస్సమ్మెస్ లతో హ్యాపీ న్యూయర్ అని విస్సెస్ చెప్పుకుంటారు.
- వరల్డ్ స్పిరిట్యువల్ డే.
బయటి లింకులు
డిసెంబర్ 30 - జనవరి 1 - నవంబర్ 30 - జనవరి 31 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |