టి. త్రివిక్రమరావు

టి. త్రివిక్రమరావు ఒక సినీ నిర్మాత.[2] ఈయన ఎన్. టి. ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి మొదలైన ప్రముఖ హీరోలతో జస్టిస్ చౌదరి, దొంగ, గూఢచారి నెం.1, ఘరానా దొంగ, బొబ్బిలి సింహం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ఈయన స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ. హిందీలో కూడా జితేంద్ర హీరోగా పలు సినిమాలు నిర్మించాడు.[3]

టి. త్రివిక్రమ రావు
జననంపాలకొండ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్[1]
మరణం2008 డిసెంబరు 03
హైదరాబాదు
మరణానికి కారణంగుండె పోటు
వృత్తిసినీ నిర్మాత
పిల్లలుఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు

జీవితం

త్రివిక్రమ రావు శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో జన్మించాడు.[1] ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.

సినిమా

ఆయన మొదటి సినిమా పొట్టేలు పున్నమ్మ.[1] దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఈయనే.[1]

మరణం

త్రివిక్రమ రావు 2008 డిసెంబరు 3 న గుండెపోటుతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[1]

మూలాలు

  1. "Film producer Trivikrama Rao passes away". timesofindia.indiatimes.com. Times News Network. 4 December 2008. Retrieved 26 March 2018.
  2. "Film producer Trivikrama Rao dead". thehindu.com. The Hindu. 4 December 2008. Retrieved 26 March 2018.
  3. "ప్రముఖ సినీ నిర్మాత త్రివిక్రమరావు మృతి". telugu.oneindia.com. One India News. 3 December 2008. Retrieved 26 March 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.