టి.ఎల్.వి.ప్రసాద్

టి.ఎల్.వి.ప్రసాద్ భారతీయ సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. ఇతడు ప్రముఖ సినిమా దర్శకుడు తాతినేని ప్రకాశరావు కుమారుడు. ఇతడు తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

తాతినేని లక్ష్మీ వరప్రసాద్
జననం టి.ఎల్.వి.ప్రసాద్
మార్చి 21, 1952
కృష్ణా జిల్లా, విజయవాడ
ఇతర పేర్లు వర ప్రసాద్, తాతినేని ప్రసాద్
ప్రసిద్ధి భారతీయ సినిమా దర్శకుడు
మతం హిందూ
తండ్రి తాతినేని ప్రకాశరావు
తల్లి అన్నపూర్ణ
వెబ్‌సైటు
http://www.tlvprasad.net/

జీవిత విశేషాలు

ఇతడు 1952, మార్చి 21వ తేదీన తాతినేని ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులకు విజయవాడలో జన్మించాడు. ఇతడు తన సినీజీవితాన్ని 1979లో కుడి ఎడమైతే చిత్రం ద్వారా ప్రారంభించాడు. తెలుగులో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి నటులతో పనిచేశాడు. 1992లో మిథున్ చక్రవర్తి హీరోగా "జనతా కీ అదాలత్" అనే సినిమా తీసి బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఆ చిత్రం గొప్ప విజయవంతం కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ళ వ్యవధిలో 35 సినిమాలు తీసి రికార్డు సృష్టించాడు. ఇంకా బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రం ఇతని ఖాతాలో ఉన్నాయి.

తెలుగు సినిమాల జాబితా

ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు ఈ విధంగా ఉన్నాయి:

క్రమసంఖ్యసినిమా పేరునటీనటులువిడుదలైన సంవత్సరం
1కుడి ఎడమైతేనూతన్ ప్రసాద్, ఫటాఫట్ జయలక్ష్మి1979
2ఛాలెంజ్ రాముడుఎన్.టి.రామారావు,జయప్రద ,గుమ్మడి1980
3రాణీకాసుల రంగమ్మచిరంజీవి,జగ్గయ్య ,శ్రీదేవి1981
4టింగు రంగడుచిరంజీవి,గీత,జగ్గయ్య1982
5మనిషికో చరిత్రమురళీమోహన్,సుహాసిని, చంద్రమోహన్, ప్రభ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, పూర్ణిమ, హేమసుందర్1983
6మనిషికి మరోపేరుచంద్రమోహన్, రంగనాథ్, సుధాకర్, తులసి, గొల్లపూడి మారుతీరావు1983
7ఈ తీర్పు ఇల్లాలిదిమోహన్ బాబు, సుజాత1984
8ఇల్లాలికో పరీక్షమోహన్‌బాబు,భానుప్రియ ,శారద1985
9ఇల్లాలే దేవతఅక్కినేని నాగేశ్వరరావు, భానుప్రియ, రాధిక1985
10డిస్కో కింగ్బాలకృష్ణ , తులసి1984
11ఆత్మబంధం1991
12పల్నాటి పులినందమూరి బాలకృష్ణ, భానుప్రియ, కొంగర జగ్గయ్య1984
13నాగుచిరంజీవి, రాధ1984
14శుభముహూర్తంమురళీమోహన్,సుహాసిని1983
15రామాయణంలో భాగవతంచంద్ర మోహన్ , భానుప్రియ1984
16ఆక్రందనచంద్రమోహన్ , జయసుధ , దీప1985
17ధర్మపత్నిసుమన్, భానుప్రియ1987
18మా ఇంటి మహాలక్ష్మిమోహన్‌బాబు, రాధ1987
19పరాజితఆనంద్ బాబు, జయసుధ1986
20రాగం తానం పల్లవిచంద్రమోహన్
21ఖైదీదాదాసుమన్, బ్రహ్మానందం,రాధ1990
22ఇల్లాలి ప్రతిజ్ఞచంద్రమోహన్ , మనోచిత్ర, నరేష్1986
23ఆత్మ బలంనందమూరి బాలకృష్ణ , భానుప్రియ1985

మూలాలు

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.