జోగులాంబ గద్వాల జిల్లా

జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. ఇది జోగులాంబ జిల్లా పరిపాలన కేంద్రం.[1]ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. ఈ జిల్లాలో 12 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి.ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్ నగర్ జిల్లా లోనివే.[2].

జోగులాంబ గద్వాల జిల్లా
తెలంగాణ జిల్లాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యపట్టణంగద్వాల
విస్తీర్ణం
  మొత్తం2.
జనాభా (2011)
  మొత్తం6
జనగణాంకాలు
  అక్షరాస్యత51 శాతం
వాహన రిజిస్ట్రేషన్TS-33
జోగులాంబ గద్వాల జిల్లా

భౌగోళిక పరిస్థితి

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో పూర్వపు జిల్లా కేంద్రం మహబూబ్ నగర్కి దక్షిణాన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జిల్లా పేరు వెనుక చరిత్ర

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఐదవ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి పేరిట ఈ జిల్లాకు నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించిన పిదప, జోగులాంబ గద్వాల జిల్లాలో అడుగుపెడుతుంది. తుంగభద్ర నది ప్రవహించే ఏకైక తెలంగాణ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మాత్రమే.

సమీప జిల్లాలు, నదులు

ఈ జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా; తూర్పున కృష్ణానది తుంగభద్ర నదుల సంగమం; ఉత్తరమున కృష్ణానది, వనపర్తి జిల్లా, పశ్చిమమున కర్ణాటక లోని రాయచూరు జిల్లా; వాయువ్య దిశలో మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జిల్లా ప్రముఖులు

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, జోగులాంబ గద్వాల జిల్లా

సురవరం ప్రతాపరెడ్డి, పాగ పుల్లారెడ్డి లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సురవరం సుధాకర్ రెడ్డి, డి.కె.సమర సింహారెడ్డి, డి. కె. భరతసింహారెడ్డి, డి. కె. అరుణ, ఆముదాలపాడు జితేందర్ రెడ్డి, మందా జగన్నాథం లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు.

జిల్లా ప్రత్యేకతలు

చేనేత వస్త్రాలకు పేరుగాంచిన గద్వాల, రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, ఒకప్పుడు మామిడిపండ్లకు పేరుగాంచిన అలంపూర్, కృష్ణా, తుంగభద్రల నడుమ 60 కిలోమీటర్ల మేర సాగిపోయే 44వ నెంబరు జాతీయ రహదారి, రెండు రాష్ట్రాలను కలుపుతూ రెండు నదులపై రెండు వంతెనలు, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి.

జిల్లాలో పరిపాలనా విభాగాలు

జిల్లాలోని మండలాలు

మునుపటి మహబూబ్ నగర్ జిల్లా లోని తొమ్మిది మండలాలు విడగొట్టి నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో విలీనం చేసారు.వడ్డేపల్లి మండలంలోని రాజోలి,మానవపాడ్ మండలంలోని ఉండవెల్లి, గట్టు మండలంలోని కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామాలు కొత్తమండలాలుగా ఏర్పడినవి.[3]

క్ర.సం.గద్వాల శాసన సభ నియోజక వర్గంఅలంపూరు శాసనసభ నియోజక వర్గం
1గద్వాల మండలంఅలంపూర్ మండలం
2మల్దకల్ మండలంమానవపాడ్ మండలం
3ధరూర్ మండలంఇటిక్యాల మండలం
4గట్టు మండలంవడ్డేపల్లి మండలం
5కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం (కొత్త మండలం)ఉండవెల్లి మండలం (కొత్త మండలం)
6-రాజోలి మండలం (కొత్త మండలం)
7-అయిజ మండలం

జిల్లాలో దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు

చిత్రమాల

ప్రధానమైన పంటలు.

ఈ జిల్లాలో పత్తి, వేరుశనగ, శనగ, మిరప, వరి ముఖ్యమైన పంటలు.

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/244.-Jogulamba-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247; Revenue (DA - CMRF) Department, Dt: 11-10-2016
  3. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/244.-Jogulamba-Final.pdf
  4. ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.