జూన్ 6
జూన్ 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 157వ రోజు (లీపు సంవత్సరములో 158వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 208 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1515 - శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.
జననాలు

సుత్తి వీరభద్రరావు
- 1699: అజీజుద్దీన్ అలంఘీర్, మొఘల్ చక్రవర్తి. (మ.1759)
- 1877: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, ప్రముఖ మలయాళ కవి.(మ.1949)
- 1890: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
- 1902: కె.ఎల్.రావు, ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)
- 1909: చోడగం అమ్మన్నరాజా, స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు (మ.1999).
- 1915: చండ్ర రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (మ.1994)
- 1915: విక్రాల శేషాచార్యులు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, కవి.
- 1929: సునీల్ దత్, భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005)
- 1936: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
- 1947: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. (మ.1988)
- 1956: జాన్ బోర్గ్, స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
- 1976: జ్యోతిరాణి. జి, రంగస్థల నటి.
మరణాలు
- 1897: కోరాడ రామచంద్రశాస్త్రి, క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816)
- 1897: కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852)
- 1976: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902)
- 1979: కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (జ.1912)
- 2001: కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)
- 2015: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 6
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 5 - జూన్ 7 - మే 6 - జూలై 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.