జీవిత

జీవిత తెలుగు సినిమా నటి మరియు దర్శకురాలు, రాజకీయ నాయకురాలు. అసలు పేరు పద్మ. స్వస్థలం శ్రీశైలం. నాన్న రామనాథం. హెల్త్ ఇన్స్‌పెక్టర్. అమ్మ శకుంతల నర్స్‌. ఒక అక్క, అన్న, చెల్లెలు. తాత ఎన్టీఆర్‌ వద్ద అకౌంటెంట్‌గా పనిచేసేవారు. తమిళ దర్శకుడు టి.రాజేందర్ 'ఉరవై కార్తకిలి' అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు. 1991లో డా.రాజశేఖర్తో పెళ్ళి జరిగింది. 1996 లో మొదటి కూతురు శివానీ మరియు 2000 లో రెండో పాప శివాత్మిక పుట్టారు.[1]

వార్తలలో జీవిత

2013 చెక్ బౌన్స్ కేసు

చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితా రాజశేఖర్ కు వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో విచారణకు హజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. జీవితా రాజశేఖర్ రెండుసార్లు కోర్టుకు గైర్హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. 2013 అక్టోబరు 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.[2]

నటించిన తెలుగు చిత్రాలు

దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.