జి.వి. పూర్ణచందు

డా.జి.వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ఆయుర్వేద వైద్యులు, వందకు పైగా రచనలు చేసిన రచయిత.

జి. వి. పూర్ణచందు
నివాస ప్రాంతం విజయవాడ
వెబ్‌సైటు
http://drgvpurnachand.blogspot.com

బాల్యం

డా. జి.వి. పూర్ణచందు 23 ఏప్రిల్ 1957లో కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టారు. సత్యప్రసూన, జి.వి.జి.కె. చంద్రమౌళీశ్వరరావులు వీరి తల్లిదండ్రులు.

చదువు

కృష్ణాజిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్నత పాఠశాల విద్య, విజయవాడ శాతవాహన కళాశాలలో (1973-75) ఇంటర్మీడియేట్, విజయవాడ డా॥నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో B.A.M.S. డిగ్రీ చదివారు.

వృత్తి, ప్రవృత్తి

  • సుశ్రుత ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బకింగ్`హాం పేట పోష్టాఫీసు ఎదురు, విజయవాడ-520 002 కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ గా పని చేస్తున్నారు.
  • కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి,
  • ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రధాన కార్యదర్శి,
  • నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు,
  • తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్.

సాహితీ జీవితంలో ముఖ్యాంశాలు

1980 దశకంలో మినీ కవితా ఉద్యమ సారధుల్లో ఒకరు. తెలుగు భాషోద్యమ ప్రముఖులు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలు, తెలుగు భాష విశిష్ట ప్రాచీనత జాతీయ సదస్సు, సింధు కృష్ణా లోయల నాగరికతల అధ్యయనం జాతీయ సదస్సు, కృష్ణాజిల్లా చారిత్రక వైభవం జాతీయ సదస్సు, న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు సదస్సు లాంటి అనేక సదస్సుల నిర్వహణ, తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి లాంటి బృహత్తర ఆకర గ్రంథాలకు సహ సంపాదకత్వం వహించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం పోరాడిన వారిలో ఒకరు. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖలు వీరిని సత్కరించాయి. ఇంచుమించు 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం,సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. దాదాపు అన్ని దిన, వార మాసపత్రికలూ వీరి రచనలు ప్రచురించాయి.వివిధ పత్రికలలో రమారమి 30 శీర్శ్హికలు నిర్వహించారు. తెలుగు భాష ప్రాచీనత నిరూపణకోసం తెలుగే ప్రాచీనం (ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రచురణ-2008) నైలూ నుండి కృష్ణ దాకా (ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురణ-2008) గ్రంథాలు, ఇంకా అనేక పరిశొధనాత్మక వ్యాసాలు వెలువరించారు, ఆం. ప్ర ఆర్కయివ్స్ వారి `ఇతిహాస్ జర్నల్` వీరి భాషా చరిత్ర పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించింది. శ్రీ మండలి బుద్ధప్రసాద్`గారితో కలిసి లండన్ నగరం, బ్రిటిష్ మ్యూజియం, బ్రౌన్ సమాధి సందర్శించారు. లండన్`లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలలో తెలుగువారి ఆహారచరిత్ర పైన పరిశోధనాపత్ర సమర్పణ చేశారు.

కుటుంబం

భార్య అరుణాదేవి. పిల్లలు ఇద్దరు - లక్ష్మీ చేతన సాఫ్ట్‘వేర్ ఇంజనీర్ (డెట్రాయిట్), కుమారుడు మనోఙ్ఞ కార్తీక్ చెన్నై ఐ ఐ టిలో పి హెచ్‘డి చేస్తున్నాడు

రచనలు

డా. జి వి పూర్ణచందు వందకుపైగా పుస్తకాలు రాశారు. వీటిలో సుమారు నలభై పుస్తకాలు సామాన్యులకు వైద్య రహస్యాలను వివరిస్తాయి. వీరి రచనలలో

7 వైఙ్ఞానిక గ్రంథాలు,

6 సృజనాత్మక గ్రంథాలు,

9 పరిశోధనాత్మక గ్రంథాలు,

2 జీవిత చరిత్ర గ్రంథాలు,

7 సాహిత్య విమర్శ గ్రంథాలు,

23 వైద్యగ్రంథాలు,

10 సామాజిక రచనలు,

17 సంపాదకత్వంలో వెలువడిన గ్రంథాలు

4 ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి.

ఆహార చరిత్ర గురించి మొత్తం 9 గ్రంథాలు వెలువరించగా, వాటిలోతరతరాల తెలుగు రుచులు పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది. తెలుగు విశ్వవిద్యాలయం వీరి "మన ఆహారం" ఆహారచరిత్ర గ్రంథాన్ని ప్రచురించింది. వీరి ‘ఆహారవేదం’ పరిశోధనా గ్రంథం అనేక పురస్కారాలను పొందింది. వీరి రచనలు `కాంతిస్వప్న` దీర్ఘకవిత, సప్తసింధు నవల, జీవిత చరిత్ర రచనల పైన ఎంఫిల్, వీరి సాహితీ జీవితం పైన పిహెచ్.డి పరిశోధనలు జరిగాయి.

పురస్కారాలు

2000 గుర్రం జాషువా మిలీనియం విశిష్ట పురస్కారం, అంబేద్కర్ జాతీయ యువజన సమితి, విజయవాడ;

2002 ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం - 'భాషాభిజ్ఞ' పురస్కారం, హైదరాబాదు;

2005 నార్ల వెంకటేశ్వరరావు విశిష్ట సాహితీ సేవా పురస్కారం, హైదరాబాదు;

2008 సర్వధారి నామ ఉగాది విశిష్ట పురస్కారం- శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక సాహితీసేవా సంస్థ విజయవాడ;

2008 కీ.శే.నండూరి సారంగపాణి ఆచార్య స్మారక విశిష్ట సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం;

2008 కాశీనాథుని నాగేశ్వరరావు ఫౌండేషన్-విశ్వదాత విశిష్ట సాహితీ పురస్కారం, యలకుర్రు;

2008 డా. ద్వా. నా శాస్త్రి విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు;

2008 కృష్ణా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వారి విశిష్ట సత్కారం, విజయవాడ;

2008 యువభారతి, హైదరాబాదు సహృదయ అభినందన పురస్కారం, హైదరాబాదు;

2008 ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ విశిష్ట సత్కారం, హైదరాబాదు;

2009 ఆం. ప్ర. అధికార భాషా సంఘం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు;

2009 ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్వర్ణోత్సవ సత్కారం;

2009 కొనకళ్ళ వెంకటరత్నం శతజయంతి సాహితీ పురస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం;

2009 నేషనల్ మెడికల్ అసోసియేషన్ విశిష్ట పురస్కారం;

2009 కొమరగిరి వెంకట సత్యనారాయణ (బుచ్చినాయన) విశిష్ట సాహితీ పురస్కారం;

2009 వైజ్`మెన్ ఇంటర్నేషనల్ ప్రతిభా పురస్కారం;

2010 గిడుగు రామ్మూర్తి భాషోద్యమ శతజయంతి పురస్కారం, తెలుగురథం, హైదరాబాదు;

2010 జ్యోత్స్న కళాపీఠం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు;

2010 తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి కీర్తి పురస్కారం;

2010 ఆరుద్ర సాహితీ ప్రతిభా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం, ఆం.ప్ర సాంస్కృతీ సమాఖ్య, విజయవాడ;

2010 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ సత్కారం, విజయవాడ;

2011 ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ శత జయంత్యుత్సవ సత్కారం;

2012 కృష్ణాజిల్లా కలెక్టర్`చే కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి సత్కారం, మచిలీపట్టణం;

2012 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం;

2012 ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య సాహితీ సత్కారం, విజయవాడ;

2013 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు;

2013 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కృష్ణా అర్బన్) సత్కారం, విజయవాడ;

2013 రోటరీ క్లబ్ విజయవాడ వారి సాహితీ సత్కారం;

2014 సరసభారతి, ఉయ్యూరు వారి ఉగాది పురస్కారం;

2014 రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ వారి ప్రతిభా పురస్కారం;

2014 ప్రపంచ తెలుగు సమాఖ్య సత్కారం, విజయవాడ;

2014 ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల రాజమండ్రి వారి సాహితీ సత్కారం;

2014 శ్రీకళాసుధ చెన్నై వారి జాతీయ పురస్కారం.

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.