జి.ఎం.సి.బాలయోగి
గంటి మోహనచంద్ర బాలయోగి (అక్టోబర్ 1, 1951 - మార్చి 3, 2002) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్.
| గంటి మోహనచంద్ర బాలయోగి | |
|---|---|
![]() జి.ఎం.సి.బాలయోగి | |
| జననం | జి.ఎం.సి.బాలయోగి అక్టోబర్ 1, 1951 తూర్పు గోదావరి జిల్లా యెదురులంక |
| మరణం | మార్చి 3, 2002 కృష్ణా జిల్లా కువ్వడలంక |
| మరణ కారణము | హెలికాప్టరు ప్రమాదం |
| సాధించిన విజయాలు | పార్లమెంట్ సభ్యుడు |
| పదవీ కాలము | మార్చి 24 - 2002 మార్చి 3 లోక్‌సభ స్పీకర్ |
| భార్య / భర్త | విజయకుమారి |
| పిల్లలు | ముగ్గురు కుమార్తెలు |
| తండ్రి | గన్నయ్య |
| తల్లి | సత్యమ్మ |
జననం
బాలయోగి 1945, అక్టోబర్ 1 న తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య మరియు సత్యమ్మ లంక గ్రామములో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.
మరణం
2002, మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.
నిర్వహించిన పదవులు

వేమగిరి (తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం
మూలాలు
ఇతర లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

