జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

పంచాయతీ రాజ్ చట్టంలో భాగంగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ[1], గ్రామాలలో పేదరిక నిర్మూలన, మరియ ఇతరత్రా వివిధ రకాల పనులను నిర్వహించడానికి, ఏర్పడిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కృషి చేస్తుంది. ఇది జిల్లాకి ఒకటి చొప్పున ఉంది.

ఇవి సంఘాల చట్టం కింద ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు. వీటి నిర్వహణాధికారిని ప్రాజెక్టు డైరెక్టరు అంటారు. అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కలెక్టరు వుంటారు. నిధులను కలెక్టరు నియంత్రిస్తారు. వీటి ముఖ్యమైన పనులు: ఉపాధి పధకం అమలు, స్త్రీ స్వయం సహాయ బృందాల ఏర్పాటుకి ప్రోత్సాహం, వాటి పనుల అనుసంధానం, మరియు ప్రపంచ బ్యాంకు సహాయంగల పేదరిక నిర్మూలనా పధకం (ఇందిరా క్రాంతి పధకం) నిర్వహణ.

వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.