జిబూటి

జిబౌటీ అధికారికంగా " జిబౌటి రిపబ్లిక్ " అని పిలువబడుతుంది. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశం. దీనికి ఉత్తరసరిహద్దులో ఎరిట్రియా, పశ్చిమ, దక్షిణ సరిహద్దులలో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో సోమాలియా ఉన్నాయి. మిగిలిన తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ ఉన్నాయి. జిబౌటి వైశాల్యం 23,200 చ.కి.మీ (8,958 చ.కీ).[2]

Republic of Djibouti
  • République de Djibouti  ([[French భాష|French ]])
  • جمهورية جيبوتي  ([[Arabic భాష|Arabic ]])
  • Jamhuuriyadda Jabuuti  (language?)
  • Gabuutih Ummuuno  (language?)
Flag
Emblem
Motto: اتحاد، مساواة، سلام ([[Arabic <sub> భాష</sub>|Arabic ]])
Unité, Égalité, Paix ([[French <sub> భాష</sub>|French ]])
Inkittino, Waguitto, Amaan (language?)
Midnimada, Sinaanta, Nabadda (language?)
Unity, Equality, Peace
Anthem: Djibouti
Location of  జిబూటి  (dark blue)

 in Africa  (light blue & dark grey)
 in the African Union  (light blue)

Capital
and largest city
Djibouti
11°36′N 43°10′E
Official languages
  • Arabic
  • French[1]
Recognised national languages
Ethnic groups
  • Somalis 60%
  • Afar 35%
  • others 5% (primarily Arab)[2]
ReligionIslam
DemonymDjiboutian
GovernmentUnitary dominant-party presidential republic under an authoritarian dictatorship[3][4]
 President
Ismaïl Omar Guelleh
 Prime Minister
Abdoulkader Kamil Mohamed
LegislatureNational Assembly
Area
 Total
23,200[2] kమీ2 (9,000 sq mi)[2] (146th)
 Water (%)
0.09 (20 km² / 7.7 sq mi)
Population
 2016 estimate
942,333[5]
 Density
37.2/km2 (96.3/sq mi) (168th)
GDP (PPP)2018 estimate
 Total
$3.974 billion[6]
 Per capita
$3,788[6]
GDP (nominal)2018 estimate
 Total
$2.187 billion[6]
 Per capita
$2,084[6]
Gini (2015)40.0[7]
medium
HDI (2015) 0.473[8]
low · 172nd
CurrencyDjiboutian franc (DJF)
Time zoneEAT (UTC+3)
Drives on theright
Calling code+253
ISO 3166 codeDJ
Internet TLD.dj

జిబౌటి ఆఫ్రికన్ యూనియన్, అరబ్ లీగులలో క్రియాశీలకంగా ఉంది.

పురాతన కాలంలో ఇది పుంట్ భూభాగంలో అక్సమ్ రాజ్యంలో భాగంగా ఉంది. సమీపంలోని జీల (ఇప్పుడు సోమాలియాలో) మధ్యయుగకాలంలో అడాల్, ఇనాట్ సుల్తానేట్స్ స్థానంగా ఉంది. 19 వ శతాబ్దం చివరలో సోమాలి, అఫార్ సుల్తాన్లతో ఫ్రెంచి ఒప్పందం మీద సంతకం చేసుకున్న తరువాత ఫ్రెంచి సొమాలియాండు కాలనీ, [9][10][11] దాని రైల్రోడ్ " డైర్ దావా " (తరువాత అడ్డిస్ అబాబా) తో స్థాపించబడ్డాయి. [12] తరువాత 1967 లో " ఫ్రెంచి టెర్రిటరీ ఆఫ్ ది అఫర్సు అండ్ ది ఇషస్ " గా పేరు మార్చబడింది. ఒక దశాబ్దం తరువాత జిబౌటియన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఓటు వేశారు. ఇది అధికారికంగా జిబౌటి రిపబ్లిక్ స్థాపనకు చిహ్నంగా ఉంది. దేశానికి దీని రాజధాని నగరం పేరు పెట్టబడింది. 1977 సెప్టెంబర్ 20 న జిబౌటి ఐఖ్యరాజ్యసమితి సభ్యదేశం అయింది.[13][14] 1990 ప్రారంభంలో ప్రభుత్వ ప్రాతినిధ్యంపై తలెత్తిన ఉద్రిక్తతలు సాయుధ పోరాటానికి దారితీశాయి. 2000 లో అధికార పార్టీ, ప్రతిపక్ష మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం ముగిసింది.[2]

జిబౌటి ఒక బహుళ-జాతి దేశం. దేశ జనసంఖ్య 9,42,333 ఉంది. దేశంలో సోమాలి, అరబిక్, ఫ్రెంచి భాషలు మూడూ అధికారిక భాషలుగా ఉన్నాయి. సుమారు 94% మంది నివాసితులు ఇస్లాం ధర్మం[2] ఆచరిస్తున్న కారణంగా ఇది అధికారిక మతంగా ఉంటోంది. ఇస్లాం వెయ్యి సంవత్సరాల కంటే అధికంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉంది. సోమాలి (ఇసా వంశం), అఫార్ రెండు అతిపెద్ద జాతి సమూహాలుగా ఉన్నాయి. ఆఫ్రోయాటిక్ భాషలు రెండు వాడుక భాషలుగా ఉన్నాయి.[2]

జిబౌటి వ్యూహాత్మకంగా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాయానమార్గం సమీపంలో ఉంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్ర మార్గాన్ని నియంత్రిస్తుంది. ఇది కీ రీఫ్యూయలింగు, సరకులను మార్చే కేంద్రంగా పనిచేస్తుంద. పొరుగునున్న ఇథియోపియాకు దిగుమతి, ఎగుమతులకు ప్రధాన నౌకాశ్రయంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రంగా, దేశంలో క్యాంప్ లెమోనియెరు వంటి అనేక విదేశీ సైనిక స్థావరాలు ఉన్నాయి. " డెవలప్మెంటు ఇంటరు-గవర్నమెంటలు అథారిటీ " ప్రాంతీయ సంస్థకు జిబౌటి నగరంలో ప్రధాన కార్యాలయం ఉంది.[2]

History

వెలుపలి లింకులు

మూలాలు

  1. "Djibouti's Constitution of 1992 with Amendments through 2010" (PDF). Government of DJibouti. p. 3. Archived (PDF) from the original on 25 June 2016. Retrieved 15 December 2017.
  2. "Djibouti". The World Factbook. CIA. 5 February 2013. Archived from the original on 2 July 2014. Retrieved 26 February 2013.
  3. "Freedom in the World 2018 – Djibouti". freedomhouse.org. Freedomhouse. 4 January 2018. Archived from the original on 8 October 2018. Retrieved 7 October 2018.
  4. Norman, Joshua. "The world's enduring dictators: Ismael Omar Guelleh, Djibouti". CBS News (11 June 2011, 4:55 PM). CBS News. cbsnews.com. Archived from the original on 17 August 2018. Retrieved 7 October 2018.
  5. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  6. "Djibouti". International Monetary Fund.
  7. Selima., Jāhāna, (2015). Work for human development (PDF). Human Development Report. United Nations Development Programme. p. 232. ISBN 9789211263985. OCLC 936070939. Archived (PDF) from the original on 22 December 2015. Retrieved 15 September 2018.
  8. "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. Archived (PDF) from the original on 18 July 2017. Retrieved 21 March 2017.
  9. Raph Uwechue, Africa year book and who's who, (Africa Journal Ltd.: 1977), p.209.
  10.  Chisholm, Hugh, ed. (1911). "Somaliland: History of French Somaliland" . Encyclopædia Britannica. 25 (11th ed.). Cambridge University Press. p. 383.
  11. A Political Chronology of Africa, (Taylor & Francis), p.132.
  12.  Chisholm, Hugh, ed. (1911). "Zaila" . Encyclopædia Britannica. 28 (11th ed.). Cambridge University Press. p. 950.
  13. "Today in Djibouti History". Historyorb.com. Archived from the original on 16 May 2011. Retrieved 27 April 2011.
  14. "United Nations member states". United Nations. Archived from the original on 30 December 2013. Retrieved 27 April 2011.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.