జాతీయ రహదారి 216 (భారతదేశం)
జాతీయ రహదారి 216 (ఆంగ్లం: National Highway 216)(పాత సంఖ్య: జాతీయ రహదారి 214 మరియు 214A) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోటిపల్లి నుండి దిగమర్రు ద్వారా ఒంగోలు నగరాల్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య, జాతీయ రహదారి 214 మరియు 214A కలిపి 216గా మార్చబడింది.[2]
![]() 216
| |
|---|---|
| మార్గ సమాచారం | |
| పొడవు: | 270 km (170 mi) |
| ప్రధాన జంక్షన్లు | |
| నుండి: | కత్తిపూడి, ఆంధ్ర ప్రదేశ్ |
| వరకు: | ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్ |
| ప్రదేశం | |
| రాష్ట్రములు: | ఆంధ్ర ప్రదేశ్: 270 km |
| ప్రాథమిక గమ్యస్థానములు: | కాకినాడ - రాజోలు- నర్సాపురం-భీమవరం |
| రహదారి వ్యవస్థ | |
| |
దారి
ఇది పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి నరసాపురం, మొగల్తూరు, నాగిడిపాలెం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలు వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. 216, 216ఎ జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 216 జాతీయ రహదారిపై పాలకొల్లు వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. 216ఎ జాతీయ రహదారికి మొగల్తూరు-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి.
రాష్ట్రాల వారి పొడవు
- ఆంధ్ర ప్రదేశ్ – 391.289 km (243.136 mi)[2]
ఇవి కూడా చూడండి
- జాతీయ రహదారుల పేర్లు
- National Highways Development Project
మూలాలు
- "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Retrieved 3 April 2012.
- "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Retrieved 11 February 2016.
