జాతీయ రహదారి 16 (భారతదేశం)

జాతీయ రహదారి 16 (ఆంగ్లం: National Highway 16) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]


16
జాతీయ రహదారి 16
మార్గ సమాచారం
పొడవు:1,448 km (900 mi)
ప్రధాన జంక్షన్లు
ఉత్తరం చివర:ఖరగ్‌పూర్
దక్షిణం చివర:చెన్నై, తమిళనాడు
ప్రదేశం
ప్రాథమిక
గమ్యస్థానములు:
కొల్కతా (by జాతీయ రహదారి 6) - బలాసోర్ - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్నం - రాజమండ్రి - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - నెల్లూరు - చెన్నై
రహదారి వ్యవస్థ
  • భారతదేశ రహదారి వ్యవస్థ
  • జాతీయ రహదార్లు
  • ఎక్స్‌ప్రెస్ రహదార్లు
  • రాష్ట్ర రహదార్లు

    రాష్ట్రాల వారి పొడవు

    కూడళ్ళు

    NH 5 in Tamil Nadu
    NH 5 near Visakhapatnam

    ఎన్.హెచ్.16 ఒడిషాలోని ఝర్పొఖారియా వద్ద జాతీయ రహదారి 6తో కలుస్తుంది.

    ఎన్.హెచ్.215 ఒడిషాలోని పానికోలి వద్ద ప్రారంభమై బర్బిల్ వరకు పోతుంది.

    ఎన్.హెచ్.200 ఒడిషాలోని చండిఖోల్ వద్ద ప్రారంభమై రాయపూర్ను కలుపుతుంది.

    ఎన్.హెచ్.5A ఒడిషాలోని చండిఖోల్ వద్ద ప్రారంభమై పరదీప్ పోర్ట్ ను కలుపుతుంది.

    ఎన్.హెచ్.42 ఒడిషా లోని చౌద్వార్ వద్ద ప్రారంభమై శంబల్ పూర్ను కలుపుతుంది.

    ఎన్.హెచ్.203 ఒడిషా లోని భువనేశ్వర్ వద్ద ప్రారంభమై పూరిను కలుపుతుంది.

    ఎన్.హెచ్.217 ఒడిషా లోని బరంపురం వద్ద ప్రారంభమై మహాసముంద్ను కలుపుతుంది.

    ఎన్.హెచ్.43 ఆంధ్ర ప్రదేశ్ లోని రాజపులోవ వద్ద ప్రారంభమై ఒడిషాలోని రాయపూర్ను కలుపుతుంది.

    ఎన్.హెచ్.9 ఈ రహదారితో విజయవాడ వద్ద కూడలిని ఏర్పరుస్తుంది.

    దారి

    ఈ రహదారి తమిళనాడులో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.

    ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తొమ్మిది కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం మరియు శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.

    ఇది ఒడిషా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం మరియు బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.

    మూలాలు

    1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Retrieved 3 April 2012.
    2. "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Retrieved 11 February 2016.

    ఇవి కూడా చూడండి

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.