జాతి
జాతి (ఆంగ్లం Species) అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాథమిక ప్రమాణం. ఒక జాతిలోని జనాభాలో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.

The hierarchy of scientific classification
జాతి పేరు
- ఒక జాతి పేరు ఆ మొక్కలోని ఒక ప్రముఖ లక్షణానికి సంబంధించిన విశేషక రూపమై (Adjective) ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరము (Small letter) తో ప్రారంభిస్తారు.
ఉదాహరణ :
- Polyalthia longifolia (పొడావైన పత్రాలు)
- Ipomea biloba (రెండు తమ్మెలుగా చీలిన పత్రాలు)
- Striga lutea (తెలుపు వర్ణము)
- కొన్ని జాతుల పేర్లు వాటి నుండి లభించే పదార్థాలను తెలియజేస్తాయి.
ఉదాహరణ :
- కొన్ని జాతుల పేర్లు ఆ మొక్కల జన్మస్థానాన్ని తెలియజేస్తాయి.
ఉదాహరణ :
- కొన్ని జాతుల పేర్లు ప్రముఖ శాస్త్రవేత్తల గౌరవసూచకంగా ఇవ్వబడ్డాయి.
ఉదాహరణ :
- డిల్లినై - డిల్లాన్
- విల్డినోవై - విల్డినోవో
- ముల్లరియానా - ముల్లర్
జీవులలో జాతుల సంఖ్య
ఇంచుమించుగా 2004 సంవత్సరం వరకు క్రింది జీవజాతులు గుర్తించబడ్డాయి:
- 287,655 మొక్కలు, వీటిలో:
- 15,000 పాచిమొక్కలు,
- 13,025 అడవిమొక్కలు,
- 980 నగ్న బీజాలు,
- 199,350 ద్విదళబీజాలు,
- 59,300 ఏకదళబీజాలు;
- 74,000-120,000 పుట్ట గొడుగులు[1];
- 10,000 లిచెనులు;
- 1,250,000 జంతువులు, వీటిలో:
- 1,190,200 అకశేరుకాలు (వెన్నెముకలేని జీవులు) :
- 58,808 సకశేరుకాలు (వెన్నెముకగల జీవులు) :
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.