జమిదగ్గుమిల్లి
'జమీదగ్గుమిల్లి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 356., యస్.ట్.డీ కోడ్=08674.
| జమిదగ్గుమిల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 396 |
| - పురుషుల సంఖ్య | 189 |
| - స్త్రీల సంఖ్య | 207 |
| - గృహాల సంఖ్య | 130 |
| పిన్ కోడ్ | : 521356 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్ఝవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములోని విద్యాసౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
ప్రభుత్వ సాయంతోపాటు, గ్రామస్థులు శ్రీ సీతాల సాంబశివరావు మరియు శ్రీ కాకర్ల చంద్రనారాయణ, మరికొందరి సహకారంతో, 1967 లో ఈ పాఠశాలను 1.8 ఎకరాల స్థలంలో, నిర్మించారు. ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు వివిధ వృత్తులలో రాణించుచున్నారు. వీరు, ఈ పాఠశాల అభివృద్ధికి, స్థానికులతో కలిసి, తమ తోడ్పాటును అందించుచున్నారు. [3] ఈ పాఠశాలలో 2016,డిసెంబరు-1న, దాతల సహకారంతో, చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన దాత కీ.శే. సీతాల శివరామకృష్ణమూర్తి మరియు శ్రీమతి కృష్ణ తులసి దంపతుల వితరణతో, రెండు లక్షల రూపాయల వ్యయంతో, ఈ విగ్రహం, సంబంధిత మండపం ఏర్పాటు చేసారు. [4]
గ్రామములో మౌలిక వసతులు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వేములమడ మంగమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం.
గ్రామములోని ప్రధాన పంటలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 396 - పురుషుల సంఖ్య 189 - స్త్రీల సంఖ్య 207 - గృహాల సంఖ్య 130
- జనాభా (2001) -మొత్తం 481 -పురుషులు 235 -స్త్రీలు 246 -గృహాలు 136 -హెక్టార్లు 223
మూలాలు
భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Zamidaggumilli". Retrieved 29 June 2016. External link in
|title=(help)
[2] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 24వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-14; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,డిసెంబరు-2; 2వపేజీ.