జన సాంద్రత

జనసాంద్రత (ఆంగ్లంలో Population density) ఒక, జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.

2006, దేశాలవారీ జనసాంద్రత.
1994 లో జనసాంద్రత, ప్రపంచ పటం.

మానవ జనాభా సాంద్రత

హాంకాంగ్ లోని ఒక వీధిలో జనాభా రద్దీ, ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలలో ఒకటి.

మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండము, దేశం, రాష్ట్రం, నగరం మరియు ఇతర విభాగాల వారీగా గణిస్తారు.

  • ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, మరియు భూమి యొక్క వైశాల్యం 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు, (200 మిలియన్ చదరపు మైళ్ళు).
  • ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం) ; 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
  • లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
  • జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగును.

ఇతర కొలమాన విధానాలు

  • జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.
  • గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
  • భూమి మీద జనాభా సాంద్రత: మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
  • వ్యవసాయ సాంద్రత: మొత్తం గ్రామీణ జనాభా / మొత్తం వ్యవసాయ భూమి.
  • నివాసాల సాంద్రత : పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
  • పట్టణ సాంద్రత : పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
  • ఉత్తమమైన పర్యావరణ: ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.

ఇవీ చూడండి

ఇతర లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.