జనసేన పార్టీ

జనసేన లేదా జనసేన పార్టీ అనునది తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. జన సేన అనగా ప్రజా సైన్యం అని అర్ధం.[1] పార్టీ లోగో మరియు రంగులు చే గువేరా మరియు అనేక ఇతర ప్రభావవంతమైన నాయకుల వంటి విప్లవకారులను తలపించేలా ఉంటాయి.

జన సేన పార్టీ
నాయకుడుపవన్ కళ్యాణ్
వ్యవస్తాపకుడుపవన్ కళ్యాణ్
స్థాపనమార్చి 14, 2014
ప్రధాన కార్యాలయంహైదరాబాదు
పత్రికWater problems in villages
సిద్ధాంతంAgriculture
రంగుఎరుపు
ECI Statusజనసేన
ఓటు గుర్తు
వెబ్ సిటు
http://janasenaparty.org/
వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్

చరిత్ర

పవన్ కళ్యాణ్ మార్చి 10, 2014 న ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేశారు. 11 డిసెంబరు 2014 న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించినది[2]. 2019 ఎన్నికలలో పార్టీ పోటీ చేయటం దీనితో ఖారారు అయినది[3][4][5][6].

ఆవిర్భావం

మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించాడు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించాడు. రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగంలో ఆయన తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు, విభజన జరిగిన తీరుపై ఆవేదన, పార్టీ విధానాలు వంటివి స్పష్టంగా వ్యక్తపరిచారు.[7]

24 అక్టోబరు 2017 న హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించబడినది. [8]

లక్ష్యాలు

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయాల్లో నిలకడ లేమి, అవకాశవాదం, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం వంటి వాటిని విమర్శించారు. ఆవిర్భావ సభలో ప్రసంగాన్ని అనుసరించి మౌలిక లక్ష్యాలుగా వీటిని పేర్కొనవచ్చు:[7]

  • బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన.
  • విద్య, వైద్యం మెరుగుపరచడం.
  • చట్టాల అమలులో అందరికీ సమన్యాయం.
  • ప్రజాధనం వ్యయానికి కాపలా.
  • జాతీయ సమైక్యత.

పార్టీ చిహ్నం మరియు జెండా

ఈ పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను మరియు పోరాటాలను నిర్వచించే ఒక దళముల కలయిక.

తెల్ల రంగు

దీనిలోని తెలుపు నేపథ్యం భారత నాగరికత మరియు సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి మరియు స్థిరత్వమును సూచిస్తుంది.

ఎరుపు రంగు

విప్లవ చిహ్నం. లోతైన మరియు నిజమైన మార్పును సూచిస్తుంది.

ఆరు మూలల నక్షత్రం

పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం. నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గం చూపించే స్వయంప్రకాశిత గుణాన్ని సూచిస్తుంది.

కేంద్ర బిందువు

మధ్యలో ఉన్న బిందువు ప్రతి జీవిలోనున్న ఆత్మ. ఇదే అఖండ సత్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనినీ మూర్తీభవిస్తుంది.

నల్లని చారలు

విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమతూకంగా వ్యవహరించి పక్షపాతధోరణిని అసమ్మతిని దూరం చేస్తుంది~

లేవనెత్తిన సమస్యలు

ప్రత్యేక హోదా

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి, మూడేళ్ళ తర్వాత అది సాధ్యం కాదని తెలుపటం పై జనసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినది. తిరుపతి, కాకినాడ మరియు అనంతపురంలలో ఈ విషయమై జనసేన బహిరంగ సభలను నిర్వహించినది.

ఉద్దానం

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అనే ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో (Chronic Kidnly Disease) బాధపడుతోన్న ప్రజలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిసారు. జనసేన పార్టీ తరపున వైద్యులను, శాస్త్రవేత్తలను నియమించి ఈ సమస్యపై వివరణాత్మక్ నివేదికను సమర్పించమని కోరారు. 48 గంటలలోగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని వారికి తగు చికిత్సను అందించాలని గొంతెత్తారు. వారికి ఉచిత బస్ పాసులు, పరిశుభ్రమైన త్రాగు నీరు, ప్రతి మండలంలో డయాలిసిస్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రం, సమస్య యొక్క మూల కారణం తెలుసుకొనటానికి నెఫ్రాలజిస్టుల నియామకం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినది.

29 జూలై 2017న పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని మన్నించి హార్వార్డ్ మెడికల్ స్కూల్ నుండి ఒక వైద్య బ్రందం ఉద్దానం కు వచ్చి ఈ వ్యాధి పై ఒక వైద్య సదస్సును నిర్వహించినది. ఈ వైద్య బృందం అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ని కలిసి పరిశోధన కేంద్రం నిర్మాణానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చవలసినదిగా కోరారు.

గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్

800 కోట్ల విలువ చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పశ్చిమ గోదావరి లోని జొన్నలగరువు, తుండుర్రు, కంపల బేటపూడి మరియు నర్సాపూర్ ప్రదేశాలకు చేరువలో నెలకొల్పబడుతోంది. ఈ ఫుడ్ పార్క్ వలన చుట్టు ప్రక్కల ఉండే జల వనరులపై, అక్కడ నివసించే ప్రజలపై చూపే దుష్ఫలితాల గురించి అటు ప్రభుత్వం గానీ, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం గానీ ప్రజలకు తెలుపలేకపోయారు. 100 కి.మీల దూరం లోపే ఉన్న జొన్నలగరువు ప్రజలు ఇది భద్రతా నియమాలకు విరుద్ధం అని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం 10 మంది నిరసనకారులపై చొరబాటు/ఆస్తులను ధ్వంసం చేయటం కేసులు పెట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు.

ఈ గ్రామస్తులు చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సమస్య పై కూలంకుషంగా అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్, ఫ్యాక్టరీని వేరొక చోటుకు మార్చాల్సిందిగా సూచించారు. గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మార్చి 2017 నాటికి ఈ ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపివేయబడినది. నిరసనకారులు ఈ రోజుకి కూడా అరెస్టు చేయబడుతోన్నారు. గ్రామస్తులకు న్యాయం చేకూర్చటానికి జనసేన కట్టుబడి ఉన్నది.

ఇతర విశేషాలు

  • ఇదే పేరుతో మరొక ధరఖాస్తు అందినట్టుగా ఎన్నికలు కమీషనర్ సూచించారు. దీనిపై త్వరలో పూర్తి వివరాలు తెలియచేస్తానని టివి.9 వారి ఇంటర్యూలో తెలియచేసారు.

మూలాలు

ఇతర లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.