ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్
Map of India with the location of ఛత్తీస్‌గఢ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
రాయ్‌పుర్
 - 21.27° ఉ 81.60° తూ
పెద్ద నగరము రాయ్‌పుర్
జనాభా (2001)
 - జనసాంద్రత
20,795,956 (17వది)
 - 108/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
135,194 చ.కి.మీ (?)
 - 16
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
2000-11-01
 - శేఖర్ దత్
 - ‌భూపేశ్ బాఘెల్
 - Unicameral (90)
అధికార బాష (లు) హిందీ, ఛత్తీస్‌గఢీ
పొడిపదం (ISO) IN-CT
వెబ్‌సైటు: www.chhattisgarh.nic.in

ఛత్తీస్‌గఢ్ రాజముద్ర

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ మరియు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి మరియు దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

పేరు వెనుక చరిత్ర

Chattisgar mening chattisgar is 36 . That is houses or pales. So once upon a time 36 houses in the area. So the name was chattisgar.

భౌగోళిక పరిస్థితులు

వాతావరణము

ఉషోగ్రత

రవాణా వ్యవస్థ

రోడ్డు మార్గము

రైల్వేలు

వాయు మార్గము

చరిత్ర

ప్రాచీన మరియు మధ్యయుగము

ఆధునిక చరిత్ర

మధ్యప్రదేశ్ నుండి విభజన

ప్రభుత్వము మరియు పరిపాలన

జిల్లాలు

పురపాలికలు

ప్రధాన పట్టణాలు

మానవాభివృద్ది సూచీలు

జనసాంద్రత

జీవన ప్రమాణాలు

విద్యా సూచీ

ఆరోగ్య సూచీ

రాష్ట్ర ఉత్పాదక సూచీ

పట్టణీకరణ

లింగ నిష్పత్తి

సంతాన సూచీ

షెడ్యూల్డ్ తెగల జనాభా

పేదరికం

తాగునీరు వసతి

పరిశుభ్రత

టెలిఫోన్ సాంద్రత

రోడ్డు సౌకర్యాలు

రాష్ట్ర గణాంకాలు

  1. అవతరణము.2000 నవంబర్ 1

వైశాల్యము.1,36,034 చ.కి.

  1. జనసంఖ్య. 25,540,196 స్త్రీలు. 12,712,281 పురుషులు. 12,827,915 నిష్పత్తి .991
  2. జిల్లాల సంఖ్య.27
  3. గ్రామాలు. 19,744 పట్టణాలు.97
  4. ప్రధాన భాష. చత్తీస్ గరి, హింది ప్రధాన మతం.హిందూ
  5. పార్లమెంటు సభ్యుల సంఖ్య, 11 శాసన సభ్యుల సంఖ్య. 90
  6. మూలము. మనోరమ యీయర్ బుక్

చిత్రమాలిక

బయటి లింకులు

  • ఛత్తీస్‌గఢ్ travel guide from Wikivoyage
  • Chhattisgarh News
  • Chhattisgarh's traditional Recipes/Food/Cusine
  •  "Chhattisgarh" . Encyclopædia Britannica (11th ed.). 1911.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.