చిత్త నక్షత్రము

చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు

చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు, గణము రాక్షస, జంతువు పులి, వృక్షము తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లెక స్వజనులకు దూరముగా పెరుగుటకు అవకాశము ఉంది. ఇతరుల ఆర్థిక సాయముతో జీవితములో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవ్వరు అనుభవించ కూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రథముగా భావించిన వారు జీవితములో దూరము ఔతారు. వాదనా పఠిమ కారణముగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుళ్యములో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబములో అందుకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరముగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వరి నుడీ ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపము, పోరుబెట్టడము, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి అమ్దరికీ దూరము ఔతారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితములో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానము ఉన్నత స్థితికి వస్తారు. విదేశీవ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడము (రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితములో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగములో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంత వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.

చిత్తా నక్షత్ర వివరాలు

నక్షత్రములలో ఇది 14వ నక్షత్రం.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
చిత్తకుజుడురాక్షసస్త్రీపులితాటిమధ్యగరుడత్వష్ట్ర1 కన్య 2,3,4 తుల
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

చిత్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారమృగశిర, చిత్త, ధనిష్టశరీరశ్రమ
సంపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషధన లాభం
విపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రకార్యహాని
సంపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రక్షేమం
ప్రత్యక్ తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిప్రయత్న భంగం
సాధన తారఅశ్విని, మఖ, మూలకార్య సిద్ధి, శుభం
నైత్య తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢబంధనం
మిత్ర తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢసుఖం
అతిమిత్ర తారరోహిణి, హస్త, శ్రవణంసుఖం, లాభం

చిత్తానక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - సింహరాశి.
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

చిత్రమాలిక

ఇతర వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.