చిత్తూరు
చిత్తూరు, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక నగరం . ఆంధ్ర ప్రదేశ్ కు దక్షిణాన, ఫోన్నై నది లోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది.చిత్తూరు ద్రవిడ ప్రాంతం, ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఇది ధాన్యము, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనెగింజలు మరియు బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు ఉన్నాయి.
| రాయలసీమ*వేదిక |
| Chittoor చిత్తూరు | |
|---|---|
| city | |
![]() Chittoor | |
| భౌగోళికాంశాలు: 13.2000°N 79.1167°E | |
| దేశం | |
| రాష్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| ప్రాంతం | రాయలసీమ |
| జిల్లా | చిత్తూరు |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 69.75 |
| ఎత్తు | m ( ft) |
| జనాభా (2011)[1] | |
| • మొత్తం | 153 |
| • సాంద్రత | 2 |
| భాష | |
| • అధికారిక | తెలుగు |
| • మాట్లాడే భాషలు | తెలుగు, తమిళం |
| భాష | |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| పిన్ కోడ్ | 517002 |
| ఎస్.టి.డి కోడ్ | +91–8572 |
| వాహన రిజిస్ట్రేషన్ | AP–03 |
| వెబ్‌సైటు | Chittoor District |
పట్టణ స్వరూపం, జనవిస్తరణ
జనాభా 252,654 (2001 గణాంకాలు).
చిత్తూరు పేరు వెనక చరిత్ర
గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామము అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరుగా మార్పు చెందిందని వేంపల్లి గంగాధరం తన రాయలసీమ కథాసాహిత్యం ఒక పరిశీలన అనే సిద్ధాంత గ్రంథంలో వ్రాశారు. తమిళనాడులోని ఈ ప్రాంతము తర్వాతి కాలములో జిల్లాగా ఏర్పడి (1911) ఆంధ్ర ప్రదేశ్ లో కలిసింది.[2]
సదుపాయాలు

రవాణా
బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది. ఇక్కడ పాకాల - కాట్పాడి రైలు మార్గములో చిత్తూరు రైల్వే స్టేషను ఉంది. ఇక్కడినుండి చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుకు మంచి రవాణా సౌకర్యము ఉంది.
విద్య
చిత్తూరు పట్టణంలో అనేక ప్రముఖ విద్యాలయాలున్నాయి. వాటిలో కొన్ని : ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు :
- సర్ సి.ఆర్.రెడ్డి ఉన్నత పాఠశాల
- బి.జెడ్. ఉన్నత పాఠశాల
- ఎస్.వి.జెడ్.పి.ఉన్నత పాఠశాల, కాణిపాకం
- పి.సి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల
- వరదప్ప నాయుడు పురపాలక పాఠశాల
- బి.ఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల
- బి.వి.రెడ్డి పాఠశాల
- లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల
- విజ్ఞాన సుధ డిగ్రీ మరియు పి.జి. కళాశాల
- గీర్వాణి డిగ్రీ కళాశాల
- శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ మరియు సాంకేతిక కళాశాల
- పరసు నరశింహ్లు శెట్టి పురపాలికోన్నత పాఠశాల సంతపేట చిత్తూరు
- పి.వి.కె.ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- విజయం జూనియర్, డిగ్రీ మరియు పి.జి.
- క్యాంఫోర్డ్ ఆంగ్ల బాషా పాఠశాలలు
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఎం అగ్రహరం
వైద్యం
పట్టణములో మంచి వైద్య సదుపాయములు గలవు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి మరియు 10 ప్రైవెటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి.
వినోదం
వినోదం కొరకు సినిమా టాకీసులు ఉన్నాయి.
- విజయలక్ష్మి
- చాణక్య
- గురునాధ
- లక్ష్మి
- రాఘవ
- ఎమ్.ఎస్.ఆర్
- శ్రీనివాస
- వెంకటేశ్వర
- మరియు ఇవికాక క్రొత్తగా అమ్యూజ్‌మెంట్ పార్క్ వెలసింది
ఆర్ధికం
ఆర్ధికంగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవుకాని చుట్టుప్రక్కల పంటలకు మార్కెట్ యార్డ్ గా ఉంది
పరిశ్రమలు
- చిత్తూరు జిల్లా సహకార చక్కెర మిల్లు
- శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర మిల్లు
- విజయ్ సహకార పాలు మరియు పాలపదార్థాల డైరీ
- అమరరాజా గ్రూప్ కంపెనీ : ఈ కంపెనీ యందు 3,600 ఉద్యోగులు పనిచేస్తున్నారు.
- న్యూట్రిన్ కన్ఫెక్షనరీస్ (2007 లో గోద్రెజ్ కంపెనీ కొన్నది)
- సారా లీ బిస్కట్స్ (క్రితం న్యూట్రిన్ బిస్కట్స్)
- ఇస్రో రాడార్ కేంద్రం గాదంకి వద్ద.
- హెరితెజ్ పాలు మరియు పాలపదార్థాల డైరీ
వ్యవసాయం
రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి మరియు వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
వ్యాపారం
చిత్తూరు పట్టణము జిల్లాలో వ్యాపారంనకు ప్రముఖ కేంద్రముగా ఉంది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి మరియు ఇక్కడి నుండి ఆక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచింది.
ఇతరాలు
- శ్రీ పొన్నియమ్మ ఆలయం:- చిత్తూరు పట్టణంలోని ఈ ఆలయం విశేషమైన ప్రాశస్తాన్ని సంతరించుకున్నది. భక్తుల కష్టాలను కడతేర్చడానికి శ్రీ పొన్నియమ్మ తల్లి స్వయంభూగా వెలసి భక్తుల పూజలందుకుంటున్నది. చూపరులను ఆకట్టుకునే వర్ణరంజితశోభతో, శిల్పకళానైపుణ్యంతో అలరారుతోంది.
- ఇక్కడికి కొద్దిదూరంలో శ్రీ దనుమకొండ గంగమ్మ తల్లి ఆలయం ఉంది.[1]
చూడదగినవి

కాణిపాక గణపతి :: చిత్తూరుకు దగ్గరలో 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటె ఆ కార్యము విఘ్నములు లెకుండా సాఫీగా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి.

అర్ధగిరి వీరాంజనేయ స్వామి :: చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని మరియు ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓంకార" నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు.
మొగిలి :: చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో మొగిలీశ్వరాలయం ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది.
పరిపాలన, రాజకీయాలు
జిల్లా కేంద్రమైనందున, జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ చిత్తూరులో గలవు. రెవిన్యూ డివిజన్లు 4. చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, చట్ట సభల్లో ప్రాతినిధ్యం
- చిత్తూరు లోకసభ నియోజకవర్గం
- చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం
- పురపాలక సంఘం (నగరపాలక సంఘం) జిల్లాలో తిరుపతి తరువాత పెద్ద నగరపాలక సంఘం.
ప్రముఖులు
- కట్టమంచి రామలింగారెడ్డి
- చిత్తూరు నాగయ్య - గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధుడయ్యాడు.
- బి.వి.ఆర్. రెడ్డి
- అపోలో హస్పిటల్స్ అదినేత ప్రతాప్ రెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త
- ప్రస్తుత సీమాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉమ్మడి రాష్త్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లా వారే..
- ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.
- సి.కె.జయచంద్ర రెడ్డి (సి.కె.బాబు) -MLA (1989 నుంచి 2014 వరకు) చిత్తూరు సేవలు అందించారు
- వెల్లాల ఉమామహేశ్వరరావు
ఇవి కూడా చూడండి
మూలాలు
- results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf "Census 2011" Check
|url=value (help) (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 21 July 2014. - వేంపల్లి, గంగాధరం (2010). రాయలసీమ కథా సాహిత్యం ఒక పరిశీలన సిద్దాంత గ్రంథం. తిరుపతి: వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. p. 7/36. Retrieved 28 July 2016.
బయటి లింకులు
| వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది చిత్తూరు. |
- చిత్తూరు జిల్లా అధికారిక వెబ్‌సైటు
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సైటులో చిత్తూరు జిల్లా వివరాలు
- [1] ఈనాడు జిల్లా ఎడిషన్ 2013 అక్టోబరు 23.

