చార్మినారు
చార్మినార్‌లోని 'చార్'ల అద్భుతం. Charminar history నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.
| ఛార్మినార్ CHARMINAR | |
|---|---|
![]() | |
| ప్రదేశము | హైదరాబాద్, తెలంగాణా, ఇండియా |
| కట్టిన సంవత్సరం | క్రీ.శ1591 |
| అక్షాంశము | 170 21' 41" ఉత్తర |
| రేఖాంశము | 780 28' 28" తూర్పు |
| సాంప్రదాయం | ఇస్లాం |
| కట్టించిన వారు | మహమ్మద్ కులీ కుతుబ్ షా |
| ఎత్తు | 48.7 మీటర్లు (160 అడుగులు) |
| మీనార్ల సంఖ్య | 4 |
| చార్మినార్, రాత్రి సమయంలో సుందర దృశ్యం | |
ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్‌కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్ అందమైన డోమ్ ఆకారంలో ఉంటుంది. చార్మినార్ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్ రూపొందిందో!
చార్మినార్చార్-మీనార్ అనగా నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. ఇది హైదరాబాదు పాత బస్తీలో ఉంది. ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టు ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతముగా గుర్తింపు వచ్చింది. దీనికి ఈశాన్యములో లాడ్ బజార్ మరియు పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మస్జిద్ ఉన్నాయి. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి యేడాది 1592లో చార్మినార్‌కు నాలుగు వైపులా చార్ కమాన్‌లు నిర్మించారు. చార్మినార్ కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్‌లను నిర్మించారు.
అసఫ్ జాహీల చే అమర్చపడిన నాలుగు గడియారాలు
హైదరబాదు నగరాన్ని పరిపాలించిన అసఫ్ జాహీ రాజులలో ఆరవ రాజైన మహబూబ్ అలీఖాన్ 1889 లో లండన్ నుండి తెప్పించిన నాలుగు గడియారాలను చార్మినార్ కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు.
గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించాడు.
మసి బారుతున్న చార్మినార్
అందమైన చార్మినార్ కాలుష్యం ధాటికి రంగుమారుతోంది. 1997లో ప్రకటించిన 'చార్మినార్ పెడస్టేరియన్‌జోన్' పథకం ప్రకారం చార్మినార్ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల వరకూ వాహనాలు తిరగకుండా కేవలం పాదచారులు మాత్రమే సంచరించాలి.తద్వారా కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచవచ్చని భావించారు. పర్యాటకులకు ఆహ్లాదం కూడా లభిస్తుంది. పర్యాటక శాఖ ఈ పథకం కోసం అప్పట్లో రూ.34 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ నిధులు సర్దుబాటు చేసుకోలేక కేంద్రాన్ని సాయం కోరింది. మరో రూ.70 కోట్లు ఖర్చుపెడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అధికారులు తైపారు. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎలాగో ఢిల్లీలో కుతుబ్ మీనార్ కుడా ప్రసిద్ధికెక్కింది. ఇది కూడా జనావాసాల మధ్యే ఉంది. ప్రభుత్వం రెండుదశాబ్దాల క్రితమే కట్టడం చుట్టూ 30 ఎకరాల స్థలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసింది. ఫర్లాంగు దూరం వరకూ రోడ్లు లేవు. రక్షిత ప్రాంతంగా ప్రకటించిన ఖాళీ స్థలం చుట్టూ ఎ త్తై న ప్రహరీ, చెట్లు ఉన్నాయి. మరింత భద్రంగా ఉంది. ఇందుకే చార్మినార్ కన్నా 150 ఏళ్లు ముందుగా నిర్మించినా చెక్కుచెదరకుండా ఉంది.[1]
చిత్రాల గ్యాలరీ
| Wikimedia Commons has media related to Charminar. |
చార్మీనార్ వద్ద తెలుగులో సమాచార ఫలకము
</gallery>
మూలములు
- ఈనాడు9.11.2009

