చలమచర్ల వేంకట శేషాచార్యులు

చలమచర్ల వేంకట శేషాచార్యులు, (Chalamacharla Venkata Seshacharyulu) సంస్కృత భాషా పండితుడు, వ్యాకరణవేత్త, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. ఎస్.వి.వి.వి.ఎస్.కళాశాల (తిరుమల తిరుపతి దేవస్థానములు) లో సంస్కృత అధ్యాపకునిగా పనిచేసి, పదవీ విరమణ చేశాడు.

చలమచర్ల వేంకట శేషాచార్యులు
జననం ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధి సంస్కృత భాషా పండితుడు
మతం హిందూమతం

విద్యాభ్యాసం

శేషాచార్యులు, 1956-1961 మధ్య కాలంలో, మచిలీపట్నంలోని శ్రీ నృసింహ సంస్కృత కళాశాల (చిట్టిగూడూరు) లో మహామహోపాధ్యాయ ఎస్.టి.జి.వరదాచార్య, టి.నరసింహాచార్యుల శిష్యరికంలో కావ్యశాస్త్రాదులు అభ్యసించాడు. 1961లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి విద్యాప్రవీణ డిగ్రీలో ప్రథమునిగా ఉత్తీర్ణుడై, తాతా సుబ్బరాయశాస్త్రి స్మారక పురస్కారాన్ని, కామేశ్వరీ విశ్వనాథ్ బంగారు పతకాన్ని గ్రహించాడు. 1969లో తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుండి శిక్షా శాస్త్రి డిప్లొమా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

రచనలు

స్వీయ రచనలు

  • సంస్కృత వ్యాకరణ సంగ్రహము, తెలుగులో - 1974.

సంపాదకత్వం చేసినవి

  • దేవనాగరిలో మార్కండేయ సంహిత ( పాంచరాత్ర ఆగమ గ్రంథం) - 1970.
  • తెలుగులో శ్రీమద్రామాయణం 2 భాగాలుగా - 2006.
  • తెలుగు లిపిలో అమరకోశం, సంస్కృతాంధ్ర వివరణలతో.
  • ఆధ్యాత్మ రామాయణం తెలుగు లిపిలో, చదలవాడ సుందరరామ శాస్త్రి ఆంధ్ర తాత్పర్యముతో.
  • శ్రీరామ కర్ణామృతం తెలుగు లిపిలో, ఆంధ్ర తాత్పర్యసహితంగా.

అనువాదాలు

కూర్పు

  • సంస్కృతాంధ్ర నిఘంటువు - 1983.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారి కొరకు, ఉన్నత పాఠశాలల మరియు జూనియర్ కళాశాలల పాఠ్య పుస్తకములు.
  • ఈ క్రింది గ్రంథములకు అర్థ, తాత్పర్య, వ్యాకరణాంశములు
ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాలు (సెప్టెంబరు 2007)
  • శ్రీమద్వాల్మీకి రామాయణమునకు, గోవిందరాజీయ వ్యాఖ్యానముతో ముద్రణ పర్యవేక్షణ
  • సంస్కృత భాషా ప్రచార సమితికి (పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్, అబిడ్స్, హైదరాబాద్), 1993 నుండి గౌరవ కార్యదర్శి.

ఇతర విషయాలు

  • ఆల్ ఇండియా రేడియోలో 1977 నుండి 2011 వరకు సంస్కృత పాఠముల నిర్వహణ.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.