చంద్రశేఖర కంబార

చంద్రశేఖర కంబార కన్నడ సాహిత్యంలో అత్యంత సాహిత్య కృషి సల్పిన వాడు పలు సాహిత్య ప్రక్రియలలో అందెవేసిన వాడు. కంబార ఒక కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు మరియు జానపదతజ్ఞ.

Chandrashekhara Kambara
చంద్రశేఖర కంబార
Chandrashekhara Kambara during a talk about "Kannada in Technology" in a meeting in Bangalore
పుట్టిన తేదీ, స్థలం (1937-01-02) 1937 జనవరి 2
Ghodageri, Hukkeri taluk, Belagavi district, Karnataka
వృత్తికవి,నాటక రచయిత, అధ్యాపకుడు
జాతీయతఇండియా
పూర్వవిద్యార్థిPhD from Karnatak University, Dharwad
కాలం1956 – present
రచనా రంగంకాల్పనిక సాహిత్యం
ప్రభావంGopalakrishna Adiga[1]
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం
సాహిత్య అకాడమి అవార్డు
పద్మశ్రీ
పంప అవార్డు
జీవిత భాగస్వామిSatyabhama
సంతానంRajashekhara Kambara, Jayashree Kambara, Geetha Sateesh, Channamma Kambar

జననం-విద్యాభ్యాసం

చంద్రశేఖర కంబార క్రీ.శ.1937 జనవరి 2వ తారీఖున కర్నాటక రాజ్యంలోని బెళగాం జిల్లాలోని ఘోడిగేరి గ్రామంలో జన్మించాడు.తండ్రి పేరు బసవణ్నెప్ప కంబార, మరియు తల్లి పేరు చెన్నమ్మ.గోకాక్ లోని మున్సిపల్ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం జరిగింది.ఆతరువాత బెళగాం/బెళగావి లోని లింగరాజ కాలేజిలో బి.ఏ.చదివాడు,1962 లో కర్నాటక విశ్వ విద్యాలయంలో ఎం.ఎ మరియు పి.ఎచ్డి (Phd) చేశాడు.

వృత్తిజీవనం-సాహిత్యం

మొదట బెంగళూరు విద్యానిలయంలో అధ్యపకుడుగా పనిచేశాడు.తరువాత క్రమంలో కర్నాటక జానపద అకాడమీ అధ్యక్షునిగా, న్యూఢిల్లీరాష్ట్రీయ నాటకశాల నిర్దేశకునిగా 3సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వర్తించాడు.హంపి లోని కన్నడ విశ్వ విద్యాలయంలో కులఫతిగా[2] చేసి పదవీ విరమణ చేసి, బెంగళూరూలోని బనశంకరిలో నివాసముంటున్నారు.తనగ్రామీణ జీవనం అనుగుణ్యమైన జానపదగేయసాహిత్యం, నాట్యం, నాటకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిసాహిత్య సంగ్రహణ, రచనలు చేశాడు.గోకాక్, బెళగావి, ధారవాడ ప్రాంత పరుష భాషను కన్నడ భాషకు దగ్గరచేసాడు.కంబార తాను వ్రాసిన అనేక నవలలను చలనచిత్రాలుగా తీసారు.వీటిలో కరిమాయి, సంగీతా, కాడు కుదురె ముఖ్యమైనవి.తాను తీసిన చిత్రాలకు తానే సంగీతం సమకూర్చాడు.కాడుకుదురె చిత్రంలో కాడు కుదురె ఒడిబందిత్తా...పాట పాడిన శివమొగ్గ సుబ్బన్నకు రాష్ట్రపతి ప్రశస్తి లభించింది.జీకె మాస్తరు ప్రణయ ప్రసంగ నవలను చిన్నతెర (టీవి) లో ధారావాహిక తీసారు.చాలా డాక్యుమెంటరి (సాక్ష్య) చిత్రాలను తీశారు.కుంబార స్వయంగా మంచిగాయకుడు, నాటకప్రియుడు.

రచనలు

  • హేళతేన కేళ (ಹೇಳತೇನ ಕೇಳ)
  • సిరిసంపిగె (ಸಿರಿಸಂಪಿಗೆ)
  • బెళ్ళిమీను (ಬೆಳ್ಳಿಮೀನು)
  • ఋష్యశృంగ (ಋಷ್ಯಶೃಂಗ)
  • కాడు కుదురె (ಕಾಡುಕುದುರೆ)
  • నాయికథె (ನಾಯಿಕಥೆ)
  • హరకెయ కురి (ಹರಕೆಯ ಕುರಿ)
  • బోళేశంకర (ಬೋಳೇಶಂಕರ)
  • సింగారవ్వ మత్తు అరమనె (ಸಿಂಗಾರವ್ವ ಮತ್ತು ಅರಮನೆ)

పైన పెర్కొన్నవి అయన రచనలలో ప్రముఖమైనవి.మాహామాయి ఈమధ్యకాలంలో () వెలువడిన నాటకం.26 సంవత్సరంల దీర్ఘకాలం తరువాత 2006, డిసెంబరున పాఠకులముందుకువచ్చింది ಶಿಖರ ಸೂರ್ಯ అనే పెద్ద నవల.జానపద విశ్వకోశ (1985) అనే బృహత్ గ్రంథాన్ని కన్నడ భాషకు అందించాడు.కాంబార 22 నాటకాలను,8 కావ్య సంకలనాలను,4 నవలలను రచించారు.అంతియే కాకుండ చకోరి అనే మహాకావ్యాన్ని, జానపదం, రంగభూమి, సాహిత్యం, మరియు శిక్షణకు సంబంధించిన 14 పరిశోధన వ్యాసాలతో కన్నడ సాహిత్యాన్ని అభిషేకించాడు.

అలంకరించిన పదవులు

  • కర్నాటక అకాడెమి అధ్యక్షుడు
  • న్యూఢిల్లి రాష్ట్రియ నాటకశాల నిర్దేశకుడు
  • హంపి విశ్వవిద్యాలయపు మొదటి ఉపకులపతి
  • కేంద్ర సాహిత్య అకాడెమి ఉపాద్యక్షుడు[3]

పొందిన సన్మానాలు-ప్రశస్తులు

  • 1991లో సిరి సంపిగె నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రశస్తి
  • 2001 లో పద్మశ్రీ
  • 2004 లో కన్నడ విశ్వవిద్యాలయం నుండి నాడోజ ప్రశస్తి
  • కేరళ నుండి కుమారన్ ఆశాన్ ప్రశస్తి
  • మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుండి కాళిదాస్ సన్మాన్ ప్రశస్తి
  • 1975 లో జోకుమార స్వామి నాటకానికి అత్యుత్తమ నారకంగా కమలాదేవి చట్టోపాధ్యాయ ప్రశస్తి
  • శిఖర సూర్య కావ్యానికి ట్యాగోరు ప్రశస్తి
  • 2002 లో కబీర్ స్న్మాన్ ప్రశస్తి
  • 2004-2010 వరకు విధాన సభ సభ్యుడు
  • 2010 లో జ్ఞానపీఠ అవార్డు ప్రదానం.జ్ఞానపీఠ పురస్కారం పొందిన 8 వ కన్నడిగుడు.

బయటి లింకులు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.