చంద్రశేఖరపురం

చంద్రశేఖరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము[1]., మండలము. పిన్ కోడ్: 523 112.,ఎస్.టి.డి.కోడ్ = 08402.

చంద్రశేఖరపురం
  మండలం  
ప్రకాశం జిల్లా పటములో చంద్రశేఖరపురం మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో చంద్రశేఖరపురం మండలం యొక్క స్థానము
చంద్రశేఖరపురం
ఆంధ్రప్రదేశ్ పటములో చంద్రశేఖరపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15.1833°N 79.2833°E / 15.1833; 79.2833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము చంద్రశేఖరపురం
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,815
 - పురుషులు 19,696
 - స్త్రీలు 19,119
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.16%
 - పురుషులు 70.24%
 - స్త్రీలు 38.81%
పిన్ కోడ్ {{{pincode}}}
చంద్రశేఖరపురం
  రెవిన్యూ గ్రామం  
చంద్రశేఖరపురం
అక్షాంశరేఖాంశాలు: 15.1833°N 79.2833°E / 15.1833; 79.2833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చంద్రశేఖరపురం
జనాభా (2001)
 - మొత్తం 7,544
 - పురుషుల సంఖ్య 2,834
 - స్త్రీల సంఖ్య 2,707
 - గృహాల సంఖ్య 1,142
పిన్ కోడ్ 523112
ఎస్.టి.డి కోడ్ 08490

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

నల్లమడుగుల 2.3 కి.మీ,కోవిలంపాడు 2.6 కి.మీ,అరివేముల 6 కి.మీ,పెదరాజుపాలెం 6.5 కి.మీ,తూర్పుకట్టకిందపల్లి 9.2 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున కనిగిరి మండలం,ఉత్తరాన వెలిగండ్ల,బేస్తవారిపేట మండలాలు,దక్షణాన సీతారాంపురం,వరికుంటపాడు, పామూరు మండలాలు,పడమరన పోరుమావిల్ల,కొమరోలు మండలాలు

సమీప పట్టణాలు

కనిగిరి 38.9 కి.మీ,పామూరు 17.8 కి.మీ,వెలిగండ్ల 23.4 కి.మీ,కొమరోలు 64.5 కి.మీ., సీతారామపురం 31.1

గ్రామానికి రవాణా సౌకర్యాలు

చంద్రశేఖరపురం నుంచి చెన్నై మరియు బెంగుళూర్ విజయవాడ హైదరాబాదు వంటి అన్ని ఇతర నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భైరవకోన ఈ మండలం లోని కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ రాచూరు పెద్దమ్మతల్లి ఆలయం

చంద్రశేఖరపురం గ్రామం, వడియరాజులనగర్‌లోని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,జూన్-4వతేదీ గురువారంతో ముగిసినవి. తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. చివరిరోజు గురువారంనాడు, గుర్రం ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా సాగినది. ఈ గ్రామానికి చెందిన శ్రీ ముప్పాళ్ళ కొండపనాయుడు, గుర్రంపై ఎక్కి ఊరేగింపుతో ప్రజలకు అభివాదం తెలిపినారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికై మండలంలోని పరిసర గ్రామాలనుండి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రధానవీధులలో భారీ యెత్తున బాణాసంచా కాల్చారు. డప్పుదరువులు, భక్తుల కోలాహలం మధ్య, కార్యక్రమం కన్నులపండువగా సాగినది. తిరునాళ్ళలో భాగంగా వడ్డెరపాలెం నుండి మహిళలు, పెద్దసంఖ్యలో పొంగళ్ళు తలపై పెట్టుకొని ఆలయం వద్దకు ప్రదర్శనగా తరలివచ్చి, అమ్మవారికి ప్రతేకపూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకునారు. భక్తులు గండదీపాలు వెలిగించారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు కుంకుమబండ్లను కట్టుకొని ఊరేగింపుకు తరలివచ్చారు. ఊరేగింపులో కత్తివిన్యాసం నిర్వహించారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,541.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,834, మహిళల సంఖ్య 2,707, గ్రామంలో నివాస గృహాలు 1,142 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 860 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18



This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.