చండూరు
చండూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన గ్రామం చెందిన మండల కేంద్రం.[1]
ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
గ్రామంలో ప్రముఖులు
ఈ గ్రామానికి చెందిన మద్దోజు సత్యనారాయణ 1930లో జన్మించాడు.ఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీమేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.[2]
మూలాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- "మరుగున పడిన మన రచయితలు". Retrieved 2018-05-01.
వెలుపలి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.