చండీగఢ్
చండీగఢ్ (Chandigarh) ఉత్తర భారతదేశంలో ఒక నగరము మరియు కేంద్రపాలిత ప్రాంతం. చండీగఢ్ రెండు రాష్ట్రాలకు (పంజాబ్ మరియు హర్యానా) రాజధాని అయినా కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ (పంజాబు:ਚੰਡੀਗੜ੍ਹ) ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో ఒకటి. చండీగఢ్ నగరం పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా సేవలందిస్తుంది. భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఈ నగరానికి స్విట్జర్లాండ్ నగర రూపకల్ప నిర్మాత "లె కార్‌బ్యూసియె" రూపకర్తగా పనిచేసాడు. ఈ నగర నిర్మాణం మరియు రూపకల్పన స్వాతంత్ర్యానికి ముందే జరిగింది. ఈ నగర రూపకల్పన ద్వారా లె కార్‌బ్యూసియె భవనిర్మాణానికి మరియు నగర రూపకల్పనకు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. [4] నగరం ప్రాథమికంగా లె కార్‌బ్యూసియె వలన రూపకల్పన చేయబడినప్పటికీ దీనికి " పిర్రే జన్నరెట్, జాన్ డ్ర్యూ మరియు మ్యాక్స్‌వెల్ ఫ్రై వంటి వారు సహకరించారు. తలసరి ఆదాయంలో చండీగఢ్ రాష్ట్రాలలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది.[5] 2010 లో భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా జాతీయ ప్రభుత్వ పరిశోధనల గుర్తింపు పొందింది.[6] అలాగే చండీగఢ్ రాష్ట్రాలలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో " హ్యూమన్ డెవలెప్మెంట్ ఇండెక్స్ " లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. చండీగఢ్ మెట్రో , పంచకుల మరియు మొహలి కలిసి త్రినగరాలుగా (ట్రై సిటీ) గా గుర్తింపు పొందింది.
| Chandigarh పంజాబీ: ਚੰਡੀਗੜ੍ਹ | |
|---|---|
| City and Union Territory | |
![]() Open Hand Monument | |
![]() Chandigarh | |
| భౌగోళికాంశాలు: 30.75°N 76.78°E | |
| Country | India |
| Union Territory/City | Chandigarh |
| Seat of Government | Chandigarh |
| ప్రభుత్వం | |
| • Administrator of UT | Shivraj Patil |
| • Mayor | Harphool Chandra Kalyan |
| • Commissioner | Vivek Pratap Singh |
| విస్తీర్ణం | |
| • City and Union Territory | 114 |
| ప్రదేశ ర్యాంకు | 33 |
| ఎత్తు | m ( ft) |
| జనాభా | |
| • City and Union Territory | 10,54,686 |
| • ర్యాంకు | 29th |
| • సాంద్రత | 9 |
| • మెట్రో[1] | 960 |
| [2] | |
| Language | |
| • Official[3] | Punjabi |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| PIN | 160xxx |
| Telephone code | 91-172-XXX XXXX |
| ISO 3166 కోడ్ | IN-CH |
| వాహన రిజిస్ట్రేషన్ | CH-01 to CH-04, PB-65, HR-70 |
| HDI | 0.892 |
| HDI Category | very high |
| Literacy | 81.9 |
| వెబ్‌సైటు | chandigarh |
| The city of Chandigarh comprises all of the union territory's area | |
చరిత్ర
1947 భారతదేశ విభజన తరువాత పంజాబు భూభాగం కూడా విభజించబడింది. తూర్పు పంజాబు భారతదేశం లోనూ పశ్చిమ పంజాబు పాకిస్తాన్ దేశంలోనూ కలుపబడింది. భారతీయ పంజాబుకు లాహోరుకు సమానమైన రాజధాని నగరం అవసరమైంది. [7] చండీగఢ్ అంటే చంఢీదేవి కోట అని అర్ధం. హిదూ ఆలయం అయిన చండీమందిర్ ఉన్న కారణంగా ఈ నగరానికీ పేరు వచ్చింది. ఈ ఆలయం నగరంలోని పంచకుల ప్రాంతంలో ఉంది. .[8] చండీగఢ్‌లో " లె కార్బుజియె " చెక్కిన " ఓపెన్ హ్యాండ్ " శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ శిల్పాలు 26 మీటర్ల ఎత్తు ఉన్నాయి. " ఓపెన్ హ్యాండ్ " ఙాపికలు లె కార్బుజియె శిల్పచాతుర్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ శిల్పాలు శాంతికి చిహ్నాలుగా ఉన్నాయి. తెరచిన హస్తానికి ఇచ్చి తీసుకోవడానికి గుర్తుగా భావించవచ్చు.[9] వీటిలో హైకోర్ట్, అసెంబ్లీ హాలు మరియు సెక్రెటరేట్ ఉన్న కాపిటల్ కాంప్లెక్స్‌లో ఉన్న 6 ఙాపక చిహ్నాలు అసంపూర్తిగా మిగిలిఉన్నాయి. వీటితో జామెంట్రిక్ హిల్ మరియు మార్టిర్స్ మెమోరియల్ వద్ద ఉన్న చిత్రాలు కూడా పూర్తిచేయబడలేదు.[10]1966 నవంబరు 1న సరికొత్తగా రూపుదిద్దుకున్న హర్యానా రాష్ట్రం పంజాబు రాష్ట్ర తూర్పు భూభాగం నుండి హిందీ మాట్లాడే ప్రజల భూభాగం వేరుచేస్తూ రూపుదిద్దబడింది.చండీగఢ్ నగరం మద్యలో ఉన్నందున దీనిని కేంద్రపాలిత ప్రదేశం చేసి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేసారు.[11] ఈ నగర చివరి పాలకుడు బ్రిజిందర్ సింగ్.
నిర్మాణ శైలి
జవహర్‌లాల్ నెహ్రూ ప్రేరేపణపై 1950 దశకంలో ఫ్రెంచి భవన నిర్మాణకారుడు లె కార్బుజియె (architect Le Corbusier) చండీగఢ్ నగరాన్ని, అందులో చాలా భవనాలను రూపొందించాడు. అప్పుడే స్వతంత్రమైన భారతదేశపు ప్రగతిశీల పధం ఇందులో ప్రతిఫలించాలని వారి సంకల్పం. చండీగఢ్ నగరం చదరాలు అమర్చినట్లుగా సెక్టార్లుగా డిజైన్ చేయబడింది. ప్రతి సెక్టారు సుమారుగా 1.5 కి.మీ x 1.5 కి.మీ. చదరం వైశాల్యం ఉంటుంది. ప్రతి సెక్టారు ఒక చిన్న పట్టణంలా, దాని స్వంత మార్కెట్, పూజా స్థలాలు, స్కూళ్ళు, కాలేజీలు కలిగి ఉంటుంది. 1 నుండి 60 వరకు సెక్టారులు ఉన్నాయి. కాని సెక్టారు నెం.13 మాత్రం లేదు. 13వ సంఖ్య అదృష్టానికి దూరమని లె కార్బుజియె నమ్మడమే దీనికి కారణం కావచ్చును.
- సెక్టారు-17: నగరానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళతో కళకళలాడుతుంటుంది. నగరవాసులకు సాయంత్రాలు గడపడానికి ఇష్టమైన స్థలం.
- సెక్టారు-35: కూడా రెస్టారెంట్లు, బార్ల మయం.
- సెక్టారు-4: రాళ్ళ తోట (Rock Garden) - పారవేసిన, వదిలేసిన వస్తువులతో నేక్ చంద్ అనే కళాకారుడు 30 సంవత్సరాలు శ్రమించి రూపొందించిన విశేష ఉద్యానవనం.
- సెక్టారు-16: గులాబీ తోటలు
- సెక్టారు-10: సుఖానా సరస్సు
- చండీగఢ్ అక్షరాస్యత 97%. ఇక్కడ ఎన్నో మంచి ప్రమాణాలు గల విద్యా సంస్థలున్నాయి.
చండీగఢ్ జనాభాలో సుమారుగా హిందువులు 78.6%, సిక్కులు 16.1%, ముస్లిములు 4%.
పర్యాటక ఆకర్షణలు
చండీగడ్ నగరంలో పర్యాటక ఆకర్షణీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో పలు విధములైన తోటలు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి. [12]
- సుఖ్నా సరస్సు
- రాక్ తోట
- లీజర్ లోయలో
- ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్
- కాపిటల్ క్లిష్టమైన
- కాక్టస్ గార్డెన్
- చిత్తరువుల నేషనల్ గ్యాలరీ
- సువాసన గార్డెన్
- కార్బూసియర్ సెంటర్
- ప్రభుత్వ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీ
- అంతర్జాతీయ డాల్ మ్యూజియం
- బటర్ పార్క్
భౌగోళికం

చండీగఢ్ హిమాలయ పర్వతశ్రేణులలోని శివాలిక్ పాదపర్వతాల వద్ద ఉంది. చండీగఢ్ వైశాల్యం 44.5 చదరపు కి.మీ. అలాగే మెట్రో వైశాల్యం 114 చదరపు కి.మీ. నగరసరిహద్దులలో పంజాబు మరియు హర్యానాలు ఉన్నాయి. [13] చండీగఢ్ సముద్రమట్టానికి 321మీటర్ల ఎత్తున ఉంది.
| Chandigarh | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చండీగఢ్ పరిసరాలలోపంజాబు రాష్ట్రానికి చెందిన మొహలి, పాజ్టలియా మరియు - రూప్‌నగర్ ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన అంబాలా మరియు పంచకుల నగరాలు ఉన్నాయి. నగర ఉత్తర భాగంలో స్వల్పంగా హిమాచల ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉంది.
చండీగఢ్‌లో తేమతో కూడిన ఉప ఉష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. చాలా వేడి వేసవి, స్వల్పమైన చలి, అప్పుడప్పుడూ వచ్చే వర్షాలు ఉష్ణోగ్రతలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి. సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 40-1 సెల్షియస్ ఉంటుంది. సంవత్సర సరాసరి వర్షపాతం 1110.7 మి.మీ ఉంటింది. నగరంలో ఒక్కోసారి శీతాకాలంలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరంలో ఉన్న సిమ్లా మరియు జమ్ముకాశ్మీరు నుండి చలిగాలులు వీస్తుంటాయి.
పర్యావరణం
చండీగఢ్‌లో అధికంగా మర్రి మరియు యూకలిఫ్టస్ ప్లాంటేషన్లు ఉంటాయి.అశోక, కసియా, మల్బరీ మరియు ఇతర చెట్లు ఉన్నాయి. నగరమంతటా వన్యప్రాంతంలాంటి వాతావరణం గోచరిస్తుంది. నగరం చుట్టూ అరణ్యాలు ఉన్నందువలన అగరంలో అనేక జంతువులు మరియు వృక్షాలు కనిపిస్తుంటాయి. జింకలు, సాంబారు జింకలు, బార్కింగ్ డీర్, రామచిలుకలు, వడ్రంగిపిట్టలు, మరియు నెమళ్ళు మొదలైనవి అభయారణ్యాలలో ఉన్నాయి. సుఖ్నా సరసులో వైవిధ్యమున్న బాతులు, గీస్ ఉన్నాయి. అలాగే శీతాకాలంలో సైబీరియా మరియు జపాన్ దేశాల నుండి వచ్చే వలసపక్షులను కూడా ఈ సరసు ఆకర్షిస్తుంది. చండీగఢ్ నగరంలో ఉన్న రామచిలుకల అభయారణ్యంలో పలు ఇతర జాతుల పక్షూలకు కూడా ఆశ్రయం ఇస్తుంది. నగరంలో ప్రఖ్యాతి వహించిన " జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డేన్ ", టెర్రస్ గార్డేన్, బోగన్‌విల్లా గార్డెన్, శాంతికుంజ్ మరియు ఇతర పూదోటలు ఉన్నాయి.
ఆర్ధికరంగం


2012 ఆర్.బి.ఐ గణాంకాలు నిధి జమచేయడంలో దేశంలో చండీగడ్ 12వ స్థానంలోనూ ౠణాలు అందించడంలో 10 వ స్థానంలోనూ ఉందని తెలియజేస్తున్నాయి.
చండీగడ్ నగరంలో ప్రజలకు ప్రభుత్వం అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది. మూడు ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్నందువలన ప్రభుత్వం ప్రజలకు అత్యధికంగా ఉపాధి కల్పించడానికి వీలుకలుగుతుంది. ఈ కారణంగానే చండీగడ్ " పెంషన్ అందుకునేవారి స్వర్గంగా " గుర్తింపు పొందింది. " ఆర్డినెంస్ ఫ్యాటరీస్ బోర్డ్ " సంస్థకు చెందిన " ఆర్డినెంస్ కేబుల్ ఫ్యాక్టరీ " భారతపభుత్వం
చండీగడ్‌లో స్థాపించింది. చండీగడ్‌లో ప్రభుత్వసంస్థలతో చేర్చి మొత్తం 15 మద్య మరియు బృహత్తర సంస్థలు ఉన్నాయి. అంతేకాక చండీగడ్‌లో " 2000 " స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నమోదయ్యాయి. కాగితం తయారీ, బేసిక్ మెటల్ మరియు అల్లాయ్స్ మరియు మెషనరీ పరిశ్రమలు ప్రధాఅమైనవి. అదనంగా ఆహారతయారీ సస్థలు, శానిటరీ వేర్, ఆటోపార్ట్స్, మెషిన్ టూల్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు ఎలెక్ట్రికల్ అప్లయంసీస్ సంస్థలు గుర్తించతగినవి. 99,262 తలసరి ఆదాయంతో చండీగడ్ దేశంలో సంపన్న నగరంగా గుర్తింపు పొందింది.
![]()
చండీగడ్‌లో 3 ప్రధాన తయారీ సంస్థలు వారి కార్యాలయాలను ఏర్పాటు చేసాయి. అవి వరుసగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ,, (ఎఫ్.ఐ.సి.సి.ఐ), ది పి.హెచ్.డి చంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, (పి.హెచ్.డి.సి.సి.ఐ) మరియు ది కాంఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, (సి.సి.ఐ) సంస్థల ప్రాంతీయ ప్రధానకార్యాలయాలు సెక్టర్ 31లో ఉన్నాయి.
చండీగడ్ ఐ.టి పార్క్ ( రాజీవ్ గాంధీ చండీగర్ టెక్నాలజీ పార్క్ ) స్థాపనతో చండీగడ్ ఇంఫర్మేష టెక్నాలజీ ప్రపంచంలో ప్రవేశించింది. చండీగడ్ నుండి ఢిల్లీ, హర్యానా, పంజాబు మరియు హిమాచల్ ప్రదేశ్ లకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గాలు ఉండడం కూడా ఐ.టి అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఐ.టి టాలెంట్ పూల్ ఐ..టి బిజినెస్ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేసే వారిని కూడా ఆకర్షిస్తుంది. పలు ఇండియన్ ఫర్ంస్ అలాగే క్యుయార్క్, ఇంఫోసిస్, డెల్, ఐ.ఐ.ఎం.బి, టెక్‌మహీంద్రా సంస్థలకు నగరంలోనూ నగరం వెలుపల కార్యాలయాలు ఉన్నాయి. 2014 గణాంకాలు ప్రపనచ 50 ఉత్తమ నగరాలలో చండీగడ్ ఒకటిగా ఉందని తెలుస్తుంది. [15]
విద్య

చండీగఢ్‌లో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న పలు విద్యాసంస్థలు మరియు పంజాబు యూనివర్శిటీ నగర ప్రజలకు విద్యను అందిస్తున్నాయి. ఈ విద్యాసంస్థలు ప్రపంచం అంతటి నుండి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.[16]
గణాంకాలు
2011 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య | 960,787 |
| మెట్రో జనసంఖ్య | 1,025,682 |
| స్త్రీల శాతం | 45% |
| పురుషుల శాతం | 55% |
| 1చ.కి.మీ జనసాంద్రత ఒల్ | 9258 |
| స్త్రీ పురుష నిష్పత్తి | 829 |
| జాతియ సరాసరి (928) కంటే | అత్యల్పం |
| అక్షరాశ్యత శాతం | 86.77%, |
| జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
| పురుషుల అక్షరాశ్యత | 90.81% |
| స్త్రీల అక్షరాశ్యత | 81.88%. |
| 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు | 10.8% |
- 2001 జనసాంద్రత 7900.
- 2001 స్త్రీపురుష నిష్పత్తి 777:1000
వినోదం
చండీగఢ్ నగరంలో రాష్ట్రాంతర క్రీడా బృందాలు అనేకం ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ.పి.ఎల్) లోని కింగ్స్ XI పంజాబు ఒక భాగం. నగరంలో బత్రా, నీలం మరియు కిరన్ వైల్ వంటి సినిమాహాళ్ళు మరియు పలు మాల్స్ మరియు పి.వి.ఆర్ ఎలెంటే మాల్, పి.వి.ఆర్ సెంట్రా మాల్, వేవ్ ఎంపోరియం మాల్, డి.టి మాల్, ఫన్ రిపబ్లిక్ మరియు ఎలెంటే మాల్ (ఉత్తర భారతదేశంలో అత్యంత పెద్దది) వంటి మల్టీ కాంప్లెక్స్ ఉన్నాయి.[17] నగరంలో సెక్టర్ 1 లో ఉన్న " రాక్ గార్డెన్ మరియు సెక్టర్ 16 లో ఉన్న " జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ " ప్రపంచ ప్రఖ్యాత కలిగినవిగా గుర్తిపు పొందాయి. అంతర్జాల అనుసంధానంలో చండీగఢ్ ప్రత్యేకత సంతరించుకుంది.
వాతావరణం
సరాసరి ఉష్ణోగ్రత
- వసంతకాలం : వసంతకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. (ఫిబ్రవరి-ఏప్రిల్) అత్యధిక ఉస్ణోగ్రత 20-13 సెల్షియస్ ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 5-12 సెల్షియస్ ఉంటుంది.
- హేమంతం : (సెప్టెమ్ంబర్ ఉండి నవంబరు మద్య) వరకు ఉంటుంది. అత్యధిక ఉస్ణోగ్రత 20-10 సెల్షియస్ ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6- 0 సెల్షియస్ ఉంటుంది.
- వేసవి: వేసవికాలం (మద్య ఏప్రిల్-జూన్) లో అత్యధికంగా ఉష్ణోగ్రత 40 సెల్షియస్ చేరుకుంటుంది. వేసవి సరాసరి ఉష్ణోగ్రత 39-30 సెల్షియస్ చేరుకుంటుంది.
- వర్షపాతం:- వర్షాకాలం (జూలై-సెప్టెంబరు మద్య) వరకు ఉంటుంది. చండీగడ్ చాలినంత వర్షపాతం అందుకుంటుంది. ఒక్కోసారి భారీవర్షాలు కూడా సంభవిస్తాయి. ఆగస్టు - సెప్టెంబరు మాసాలలో నైరుతి ఋతుపవనాల కారణజ్ంగా సాధారణ వర్షపాతం ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల కారణంగా నగరంలో భారీ వర్షపాతం సంభవిస్తుంది. చండీగడ్ నారంలో అత్యధికంగా నమోదైన వర్షపాతం 195 మి.మీ.
- శీతాకాలం:- శీతాకాలం (నవంబరు-ఫిబ్రవరి) చలి అత్యల్పంగా ఉంటుంది ఒక్కోమారు చలి కొంచం అధికంగా ఉంటుంది. శీతాకాల ఉష్ణోగ్రత 14-5 సెల్షియస్ ఉంటుంది. ఒక్కోసారి వర్షపాతం కూడా ఉంటుంది. ఈ సమయంలో వడగళ్ళు కూడా పడుతుంటాయి. 2013 సోమవారం 7న చండీగడ్‌లో ఉష్ణోగ్రత 30 సంవత్సరాల అల్ప ఉష్ణోగ్రతకు (6.1సెల్షియస్) ఉంటుంది.ప్రజలు దినిని
ఎముకలు కొరికే చలిగా వర్ణించారు.
| Climate data for చండీగడ్ | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Month | Jan | Feb | Mar | Apr | మే | Jun | Jul | Aug | Sep | Oct | Nov | Dec | Year |
| Average low °C (°F) | 2.1 | 4.3 | 9.4 | 14.9 | 20.2 | 22.4 | 21.0 | 20.3 | 17.8 | 13.0 | 6.5 | 2.7 | — |
| Rainfall mm (inches) | 46.6 | 33.9 | 29.3 | 11.3 | 24.2 | 112.6 | 276.3 | 282.8 | 179.0 | 41.6 | 6.7 | 18.9 | — |
| Avg. rainy days | 3.8 | 3.9 | 2.6 | 2.4 | 2.5 | 7.1 | 12.9 | 13.3 | 6.1 | 1.9 | 1.3 | 1.9 | — |
| Source: World Meteorological Organisation[18] | |||||||||||||
ఇచట జన్మించిన ప్రముఖులు
- అభినవ్ బింద్రా, ఒలింపిక్ బంగారు పతకగ్రహీత
- నీరజ భానోత్, విమాన సహాయకురాలు మరియు మోడల్
- జీవ్ మిల్కా సింగ్, ప్రొఫెషనల్ గోల్ఫర్
- యువరాజ్ సింగ్, భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు
- కపిల్ దేవ్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్
- దినేష్ మోంగియా, భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్
- నవల్‌ప్రీత్, రంగులు, చిత్రనిర్మాత
- కిరణ్ ఖేర్, నటీమణి మరియు రంగస్థల నటి
- గుల్ పనాగ్, భారతీయ నటి
- ఆయుష్మాన్ కుర్రానా, భారతీయ చిత్ర నటుడు
- నెక్ చాంద్ సైనిక్, స్థానిక కళాకారుడు మరియు చండీగఢ్ రాక్ గార్డెన్ సృష్టికర్త
- యామి గౌతమ్, భారతీయ నటి
- ముఖేష్ గౌతమ్, పంజాబీ చిత్ర దర్శకుడు
- సర్వీన్ చావ్లా, భారతీయ నటి అష్దెన్ అవార్డులు - యు.కె యొక్క
- రమేష్ కుమార్ నిభోరియా, విజేత
- భారతీ వర్మ, ప్రఖ్యాత శక్తి నిపుణుల
- ప్రభ్జాట్ కౌర్ బైన్స్ అంతర్జాతీయ శక్తి నిపుణుల ( యూనివర్శిటీ గోల్డ్ పతక)
- ఆదివారం సేథీ, స్వర్గం యొక్క మేనేజింగ్ డైరెక్టర్
- మిల్కా సింగ్, స్వతంత్ర భారతదేశం యొక్క అత్యుత్తమ అథ్లెట్ . " భాగ్ మిల్కా సింగ్ భాగ్ ' అనే చిత్రంలో తన జీవితం ఉత్పత్తి చేయబడింది . జీవ్ మిల్కా సింగ్ తన కుమారుడు.
ప్రయాణవసతులు

భారతదేశంలో అత్యధికంగా వాహనాలను ఉపయోగిస్తున్న నగరాలలో చండీగఢ్‌కు ప్రధమస్థానం. [19] వెడల్పైన రహదార్లు, చక్కని నిర్వహణ మార్గమంతా వాహనాల పాత్కింగ్ సౌకర్యం ఉండడం ఇందుకు కారణమని భావించవచ్చు. " ది చంఢీగఢ్ ట్రాంస్‌పోర్ట్ " ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ నుండి ప్రభుత్వ బసులను నిర్వహించే అధికారాన్ని అందుకున్నది. ఇది సెక్టర్లలో 17 మరియు నగరంలో 43 బసులను నఆడుపుతుంది. [20] సి.టి.యు పొరుగు రాష్ట్రాలైన పంజాబు , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీలకు కూడా బసు సేవలను అందిస్తుంది. చండీగఢ్ జాతీయరహదారి 22 మరియు జాయీయరాదారి 21తో రోడ్డు ద్వారా అనుసంధానం చేస్తుంది. చండీగఢ్ రైల్వేస్టేషన్ ఇండియన్ రైల్వే నార్తన్ రైల్వే జోన్‌లో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, కొలకత్తా,విశాఖపట్నం,జైపూర్,లక్నో,భోపాల్,ఇండోర్,త్రివంద్రం మరియు అమృత్‌సర్ వంటి ప్రముఖ నగరాలకు రైలు వసతి కల్పిస్తుంది. అంతేకాక ఇక్కడి నుండి అంబాలా , కొల్లం,పానిపట్మరియు తిరువనంతపురం వంటి దక్షిణభారతీయ ప్రముఖ నగరాలకు కూడా రైలు వసతి కల్పిస్తుంది. " చంఢీగఢ్ విమానాశ్రయం " భారతీయ ప్రముఖనగరాలకు కమర్షియల్ విమాన సేవలను అందిస్తుంది. ఢిల్లీ, ముంబై,జైపూర్,ఇండోర్ నగరాలకు విమానసేవలు అందిస్తుంది. సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణదశలో ఉంది. చంఢీగఢ్ మెట్రో రైలు విధానం 2018 నాటికి కార్యరూపం దాల్చనుంది. .
చిత్రమాలిక
- Punjab and Haryana High Court
Secretariat Building by Le Corbusier
Rock Garden
Rock Garden
Chandigarh Airport old terminal
Zakir Hussain Rose Garden
Street play in Chandigarh Shoping Complex
Street play in Chandigarh Shoping Complex
Lake in Chandigarh
Judicial Courts complex in Chndigarh
బయటి లింకులు
- http://www.pals.org/pec/chandigarh/chandigarh.html
- http://www.whereincity.com/india/chandigarh/
- Nek Chand Foundation
- Government Museum and Art Gallery
- "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
- "http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/prov_results_paper2_indiavol2.html" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012. External link in
|title=(help) - "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 122–126. Retrieved 16 February 2012.
- Business Portal of India
- "Front Page News : Monday, July 26, 2010". Chennai, India: The Hindu. 17 September 2008. Retrieved 2010-07-26.
- "India's cleanest: Where does your city stand?: Rediff.com News". News.rediff.com. 13 May 2010. Retrieved 2010-07-26.
- Chandigarh History – History Of Chandigarh India – Origin & History of Chandigarh
- The Official Government Website
- Frommer's India (2010) Pippa de Bruyn, John Wiley & Sons, p613 ISBN 9780470556108
- "Capitol Complex, as Le Corbusier wanted it, remains incomplete". Indian Express. 2010-06-19. Retrieved 2013-07-02.
- "1st November 1966 - Haryana Day - History - Haryana Online - North India". Haryana Online. Retrieved 2013-07-08.
- "Places to See". chandigarhtourism.gov.in. Chandigarh Tourism. Retrieved 19 March 2014.
- Falling Rain Genomics, Inc – Chandigarh
- Chandigarh's the richest of 'em all
- The Hindu Business Line
- "City Beautiful". The Indian Backpacker. December 2012. Retrieved 2 January 2013.
- "Elante Mall Review - Chandigarh". textilefabricgarment.com. Retrieved 2013-08-25.
- World Weather Information Service-Chandigarh, World Meteorological Organisation. Retrieved 29 September 2012.
- Top Ten Towns with Highest Nos. of Car Ownership in India
- Chandigarh Transport Undertaking ISBT

