గోవింద్ వల్లభ్ పంత్
గోవింద్ వల్లభ్ పంత్ (1887 సెప్టెంబరు 10 - 1961 మార్చి 7 ) భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు. హిందీని భారత దేశ అధికార భాషగా చేయడానికి ఈయన కృషి చేశాడు.
| గోవింద్ వల్లభ్ పంత్ | |
|---|---|
![]() గోవింద్ వల్లభ్ పంత్ | |
| జననం | గోవింద్ వల్లభ్ పంత్ 1887 సెప్టెంబరు 10 |
| మరణం | 1961 మార్చి 7 |
| ఇతర పేర్లు | గోవింద్ వల్లభ్ పంత్ |
| ప్రసిద్ధి | స్వాంతంత్ర్య సమరయోధుడు |
ఒక పేద కుటుంబములో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యములో విజయం సాధించాడు. 1921లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. 1937-39, 1946-50 లలో సంయుక్త రాజ్యాలకు (United Provinces: యునైటెడ్ ప్రావిన్సెస్) ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తర్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 లలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1955 లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయనకు 1957లో భారతరత్న పురస్కారం లభించింది.
| రాజకీయ కార్యాలయాలు | ||
|---|---|---|
| అంతకు ముందువారు |
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి 26 జనవరి 1950 – 27 డిసెంబర్ 1954 |
తరువాత వారు సంపూర్ణానంద్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

