గోకులము
గోకులము భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| గోకులము | |
|---|---|
![]() గోకులము Location in Uttar Pradesh | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| పేరు | |
| ఇతర పేర్లు: | గోకులము |
| ప్రధాన పేరు : | గోకులము |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| రాష్ట్రం: | గుజరాత్ |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | నవమోహన కృష్ణన్ |
| ప్రధాన దేవత: | రుక్మిణీ-సత్యభామ |
| దిశ మరియు స్థానం: | తూర్పు ముఖము |
| పుష్కరిణి: | యమునానది |
| విమానం: | హేమకూట విమానము |
| కవులు: | కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్-ఆండాళ్ |
| ప్రత్యక్షం: | నందగోపునకు ప్రత్యక్షము |
విశేషాలు
ఆళ్వార్లు కీర్తించిన కోవెలగాని పెరుమాళ్లుగాని ఇప్పుడు లేవు. ఇపుడున్న సన్నిధులు తర్వాత నిర్మించినవే. గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు-ఊయలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. ఇచట రెండు సన్నిధులు ఉన్నాయి. భక్తులు రెండింటిని దర్శిస్తారు. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము-బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగుతుంటాయి.
సాహిత్యం
శ్లో. గోకులే యమునా తీరే ప్రాచీముఖ లసత్ స్థితి:
రుక్మిణీ సత్యభామాభ్యాం హేమకూట విమానగ:|
నవమోహన కృష్ణ: శ్రీ నంద గోపాక్షి గోచర:|
రథాంశ కలిజిత్ గోదా కులశేఖర సంస్తుత:||
పాశురాలు
పా. నాణి యినియోర్ కరుమ మిల్లై నాలాయలారు మఱిన్దొழிన్దార్
పాణియాదెన్నై మరున్దు శెయ్‌దు పణ్డుపణ్డాక్కవుఱుదిరాగిల్
మాణియురువా యులగళన్ద మాయనై క్కాణిల్ తవై మఱియుమ్;
ఆణై యాల్‌నీరెన్నై క్కాక్కవేణ్డిల్‌ఆయ్‌ప్పాడిక్కే యెన్నైయుయ్‌త్తిడుమిన్.
ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-2
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | ప్రదేశం | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|---|
| నవమోహన కృష్ణన్ | రుక్మిణీ-సత్యభామ | గోకులము | యమునానది | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | నందగోపునకు ప్రత్యక్షము | హేమకూట విమానము | కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-ఆండాళ్ |
మంచిమాట
- శిష్యుని హితము గోరువాడు ఆచార్యుడు, మనోవాక్కాయముల ఆచార్యకైంకర్యము చేయువాడు శిష్యుడు.
- ఆకలిగొన్నవానికి అమృతపానము వంటిది ద్వయాను సంధానము.
చేరే మార్గం
మధురకు 12 కి.మీ. దూరములో కలదు
