గుంటూరు శేషేంద్ర శర్మ
జన బాహుళ్యంలో శేషేంద్ర గా సుపరిచుతులైన గుంటూరు శేషేంద్రశర్మ, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.[2] "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.
| గుంటూరు శేషేంద్ర శర్మ | |
|---|---|
![]() గుంటూరు శేషేంద్ర శర్మ | |
| జననం |
అక్టోబర్ 20, 1927 నాగరాజపాడు, నెల్లూరుజిల్లా |
| మరణం |
మే 30, 2007 హైదరాబాదు |
| భార్య / భర్త | జానకి [1] |
| పిల్లలు |
వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) |
| తండ్రి | సుబ్రహ్మణ్య శర్మ |
| తల్లి | అమ్మాయమ్మ |
విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్
ఉద్యోగం: పురపాలక శాఖలో కమిషనర్ గా, జనవాణి పత్రికలో పాత్రికేయుడిగా
రచనలు
- 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి)
- 1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
- 1974 - మండే సూర్యుడు
- 1974 - రక్తరేఖ
- 1975 - నా దేశం - నా ప్రజలు
- 1976 - నీరై పారిపోయింది
- 1977 - గొరిల్లా
- నరుడు - నక్షత్రాలు
- షోడశి - రామాయణ రహస్యములు
- స్వర్ణ హంస
- ఆధునిక మహాభారతం
- జనవంశం
- కాలరేఖ (సాహిత్య అకాడమీ అవార్డు)
- కవిసేన మేనిఫెస్టో
- మబ్బుల్లో దర్బార్...
- 1968 - సాహిత్య కౌముది
- ఋతు ఘోష
- ప్రేమ లేఖలు
అవార్డులు
- 1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
- 1999 -సాహిత్య అకాడమీ అవార్డు
- రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
- 1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
మరణం
శేషేంద్రశర్మ మే 30, 2007వ తేదీ రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. కడసారి దర్శించేందుకు వీలుగా శేషేంద్ర భౌతిక కాయాన్ని ఆయన నివాసమైన పాన్‌మండీలోని ధన్రాజ్‌గిరి ప్యాలెస్‌లో ఉంచారు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. ఈ కార్యక్రమానికి అనేకమంది సాహితీప్రియులు, అధికారులు, రాజకీయవేత్తలు, సామాజిక సేవాసంస్థల ప్రతినిధులు హాజరైనారు. శేషేంద్ర మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. .[3]
విశేషాలు
శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు[1]. ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట.
మూలాలు
బయటి లింకులు
- గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలు లభించు చోటు
- శేషేంద్ర శర్మపై సమగ్ర సమాచారమున్న వెబ్ పేజీ
- మ్యూస్ఇండియా.కాంలో శేషేంద్ర శర్మపై ఒక వ్యాసం
- గ్రేటెస్ట్ సిటీస్.కాంలో శేషేంద్ర శర్మపై ఇంకో వ్యాసం
- డీఎల్ఐలో మండే సూర్యుడు కవితా సంకలనం
- శేషేంద్రశర్మ రాసిన చివరి కవిత, "పువ్వులు, పువ్వులు, పువ్వులు" (ఈమాట వెబ్ పత్రిక నించి)
- శేషేంద్రశర్మ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ (ఈమాట వెబ్ పత్రిక నించి)
