గన్నవరం శాసనసభ నియోజకవర్గం
కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో గన్నవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. గన్నవరం నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. గన్నవరం, ఉంగుటూరు మండలాలు పూర్తిగా, కంకిపాడు మండలంలోని రెండు, బాపులపాడు మండలంలోని తొమ్మిది గ్రామాలు, ఉయ్యూరు మండలంలోని రెండు గ్రామాలు కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
పునర్విభజన తదుపరి గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలోని గ్రామాలు పూర్తిగా, విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలతో నియోజకవర్గాన్ని పునర్విభజించారు. తూర్పున ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు, పడమరన విజయవాడ రూరల్ మండలంలోని పి.నైనవరం, దక్షిణాన రామవరప్పాడు, ఉత్తరాన బొమ్ములూరు గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నాయి.
నియోజకవర్గ ప్రజలలో సామాజిక ఆర్థిక పరిస్థితుల జీవనశైలిలో ఇక్కడ నిరుపేదలు, దళిత, వ్యవసాయ కార్మికులు ఎక్కువ. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పెద్ద పథకాలు అయిన ఐటీ పార్కు, విమానాశ్రయ అభివృద్ధి, పోలవరం తవ్వకం వంటివి ఉన్నాయి..
ముఖ్యమైన ప్రదేశాలు
విమానాశ్రయం, ఐటీపార్కు . సూరంపల్లి పారిశ్రామిక వాడ, పశుదాణా కర్మాగారం, డెల్టా షుగర్స్, పట్టుగూళ్ల పరిశ్రమ, శ్రీనివాస హేచరీస్ వంటివి ఉన్నాయి. పెద అవుటుపల్లిలో జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రం, చిక్కవరం గ్రామములో బ్రహ్మయ్య లింగం ఆలయం, హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి.
ప్రముఖులు
ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కవి విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జైరమేష్, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్.రామ్మోహనరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి రామ్మోహనరావు, గద్దె రామ్మోహనరావు, తానా అధ్యక్షుడు టీబీఆర్ ప్రసాద్, కేవీపీ రామచంద్రరావు వంటి వారు ఎందరో ఉన్నారు.
నియోజకవర్గంలోని మండలాలు
నైసర్గికం
- విజయవాడ, రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం నియోజకవర్గం వస్తుంది.
1983 ఎన్నికలు
1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముసునూరు రత్నబోస్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కొమ్మినేని శేషగిరిరావుపై 1211 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రత్నబోస్‌కు 23436 ఓట్లు రాగా, శేషగిరిరావుకు 22225 ఓట్లు లభించాయి.[1]
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకిచెందిన ఎం.వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన డి.వి.బలవర్థన్ రావుపై 2235 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. వెంకటేశ్వరరావుకు 42444 ఓట్లు లభించగా, బలవర్థన్ రావు 40209 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన డి.బాలవర్థనరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వెంకటేశ్వరరావుపై 17195 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[2]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]
| సంవత్సరం | రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2014 | జనరల్ | వల్లభనేని వంశీమోహన్ | పు | తె.దే.పా | 99163 | దుట్టా రామచంద్రరావు | పు | వై.కా.పా | 89615 | ||
| 2009 | (SC) | పాముల రాజేశ్వరి దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 44756 | పూలపర్తి నారయణ మూర్తి | పు | తె.దే.పా | 41651 | ||
| 2009 | జనరల్ | వెంకట బాల వర్థన రావు దాసరి | పు | తె.దే.పా | 82218 | ముద్రబోయిన వెంకటేశ్వర రావు | పు | కాంగ్రెస్ | 66923 | ||
| 2004 | జనరల్ | ముద్రబోయిన వెంకటేశ్వర రావు | పు | ఇతరులు | 42444 | బాలవర్థనరావు | పు | తె.దే.పా | 40209 | ||
| 1999 | జనరల్ | దాసరి వెంకట బాలవర్థన రావు | పు | తె.దే.పా | 49563 | ముద్రబోయిన వెంకటేశ్వర రావు | పు | కాంగ్రెస్ | 27763 | ||
| 1994 | జనరల్ | గద్దే రమ మొహన్ | పు | ఇతరులు | 45824 | దాసరి వెంకట బాలవర్థన రావు | పు | తె.దే.పా | 35121 | ||
| 1989 | జనరల్ | ముసునూరు రత్న బోస్ | పు | కాంగ్రెస్ | 43225 | ములుపూరు బాల క్రిష్ణరావు | పు | తె.దే.పా | 42510 | ||
| 1985 | జనరల్ | ములుపూరు బాల క్రిష్ణరావు | పు | తె.దే.పా | 40641 | కొలుసు పెద బెద్దయ్య | పు | కాంగ్రెస్ | 35072 | ||
| 1983 | జనరల్ | రత్న బోస్ ముసునూరు | పు | ఇతరులు | 23436 | శేషగిరిరావు కొమ్మినేని | పు | కాంగ్రెస్ | 22225 | ||
| 1978 | జనరల్ | పుచ్చలపల్లి సుందరయ్య | పు | సిపిఐ(ఎం) | 35984 | లంక వేంకటేశ్వర రారు (చిన్ని) | పు | కాంగ్రెస్ | 18472 | ||
| 1972 | జనరల్ | ఇ.ఎస్.ఆనంద బాయి తప్పట | పు | కాంగ్రెస్ | 21662 | అట్లూరి శ్రీమన్నారాయణ | పు | సిపిఐ(ఎం) | 21307 | ||
| 1967 | జనరల్ | వి.సీతారామయ్య | పు | కాంగ్రెస్ | 27656 | ఎస్.మనికొండ | పు | సిపిఐ(ఎం) | 23727 | ||
| 1962 | జనరల్ | పుచ్చలపల్లి సుందరయ్య | పు | సి.పి.ఐ | 28264 | కలపల సూర్య ప్రకాశరావు | పు | కాంగ్రెస్ | 23463 | ||
| 1955 | జనరల్ | పుచ్చలపల్లి సుందరయ్య | పు | సి.పి.ఐ | 22575 | వెలివెల సీతారామయ్య | పు | కాంగ్రెస్ | 21754 |
ఇవి కూడా చూడండి
మూలాలు
- ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
- ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- www.elections.in/andhra-pradesh/assembly-constituencies/gannavaram.html