గడ్డివాము

వరి పైరు కోసి దానిని కంకుల గుండు లేదా ట్రాక్టర్తో నూర్చి దాని నుండి గింజలను తీసివేసి మిగిలిన గడ్డిని ఒక కుప్పగా వేస్తారు. దానినే గడ్డి వామి అంటారు. సాధారణంగా వరిగడ్డిని రాతి కూసాలపైన పందిరి వేసి దానిపైన వామి వేస్తారు. గడ్డితీయడానికి, దానికి నిచ్చెన వేసి ఎక్కి గడ్డిని తీసి పశువులకు వేస్తారు. ఉత్తరాంధ్రలో నేలపైనే గడ్డి వామును ఉంచుతారు.
వరిగడ్డిని పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. సంవత్సరమంతా రైతులు వారి పశువుల మేతను భద్రపరచుకొనుటకు గడ్డిని కుప్పగా వేసి ఉంచుతారు. ఈ గడ్డి వాములోని గడ్డిని కొద్దికొద్దిగా తీసి పశువులకు మేతగా ఉపయోగిస్తారు.

అప్పుడే కోసిన గడ్డితో వాము
విశాఖ జిల్లా, రాజుల తాళ్ళవలస వద్ద గడ్డివాము

అగ్నిమాపకశాఖ వారి సూచనలు

1. పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేయండి.

2. గడ్డివాముల నుండి నివాస గృహములను తప్పనిసరిగా 60 అడుగుల దూరమును పాటించండి.

3. గడ్డివాములను గాలివాటంగా రైట్ యాంగిల్స్ లో నిర్మించండి.

సామెతలు

గడ్డివాము వద్ద కుక్క కాపల గడ్డివాము కాడి కుక్క తను తినదు ఇతరులను తిననివ్వదు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.