గంధకము

సల్ఫర్ లేదా గంధకము (Sulfur), ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 16. దీని సంకేతము S. ఇది భూమిపై విరివిగా లభించే ఒక అలోహము. ఇది బహు సంయోజనీయత కలిగిన మూలకము. . ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి. సిస్టీన్ మరియు మితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్ధాలు (insecticides and fungicides). వ్యవహార ఆంగ్ల భాషలో brimstone అని కూడా అంటారు.

కొన్ని సల్ఫర్ వినియోగాలు
  • రబ్బర్ వల్కనైజేషన్‌లో సల్ఫర్ ఒక ముఖ్యమైన పదార్థం. ఈ ప్రక్రియలో పాలీ సల్పైడులు ఆర్గానిక్ పాలీమర్‌తో crosslink అవుతాయి.
  • gunpowder తయారీలో సల్ఫర్ వాడుతారు
  • సల్ఫర్, మిథేన్‌ల మధ్య రసాయనిక ప్రక్రియ వలన కార్బన్ డై సల్పైడ్ తయారవుతుంది. దీనిని సెల్లోఫేన్ (cellophane) మరియు రేయాన్ (en:rayon) తయారీలో వాడుతారు.[3]
  • మనకు లభించే సల్ఫర్‌లో 85% వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లం (sulfuric acid) (H2SO4) తయారీలో వాడుతారు. ప్రపంచంలోని పారిశ్రామిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైన పదార్థం. దేశాల పారిశ్రామిక ప్రగతికి సూచికగా ఆ దేశపు సల్ఫ్యూరిక్ ఆమ్ల వినియోగాన్ని కూడా చెబుతారు.[4] ఎరువుల తయారీ, లోహాల వెలికి తీత, ఖనిజాల శుద్ధి, చమురు శుద్ధి పరిశ్రమలలో ఈ ఆమ్లం వినియోగం ఉంది.
  • డిటర్జెంటులు, పెస్టిసైడులు, ఫంగిసైడులు, వ్యవసాయ రసాయనాలు, రంగు పదార్ధాలు, ఫొటోగ్రఫీ వంటి పదార్ధాలు, పనులలో సల్ఫర్ వినియోగం ఉంటుంది.
  • కొన్ని ఔషధులలో, ముఖ్యంగా చర్మవ్యాధుల వివారణలలో సల్ఫర్ ఉపయోగపడుతుంది.
  • Magnesium sulfate, better known as Epsom salts, can be used as a laxative, a bath additive, an exfoliant, a magnesium supplement for plants, or a desiccant.
సల్ఫర్,  16S
సాధారణ ధర్మములు
కనిపించే తీరుlemon yellow sintered microcrystals
ప్రామాణిక అణు భారం (Ar, standard)[32.059, 32.076] conventional: 32.06
ఆవర్తన పట్టికలో సల్ఫర్
O

S

Se
ఫాస్ఫరస్సల్ఫర్క్లోరిన్
పరమాణు సంఖ్య (Z)16
గ్రూపుగ్రూపు 16 (chalcogens)
పీరియడ్పీరియడ్ 3
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ne] 3s2 3p4
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 6
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం388.36 K (115.21 °C, 239.38 °F)
మరుగు స్థానం717.8 K (444.6 °C, 832.3 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)(alpha) 2.07 g/cm3
(beta) 1.96 g/cm3
(gamma) 1.92 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు1.819 g/cm3
సందిగ్ద బిందువు1314 K, 20.7 MPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(mono) 1.727 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(mono) 45 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ22.75 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 375 408 449 508 591 717
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు6, 5, 4, 3, 2, 1, -1, -2 strongly acidic oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.58
అయనీకరణ శక్తులు
  • (more)
సమయోజనీయ వ్యాసార్థం105±3 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం180 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం ఆర్థోరాంబిక్
ఉష్ణ వాహకత(amorphous)
0.205 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం(amorphous)
2×1015  Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[1]
బల్క్ గుణకం7.7 GPa
మోహ్స్ కఠినత్వం2.0
CAS సంఖ్య7704-34-9
చరిత్ర
ఆవిష్కరణChinese[2] (Before 2000BC)
Recognized as an element byAntoine Lavoisier (1777)
సల్ఫర్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
32S 95.02% S, 16 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
33S 0.75% S, 17 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
34S 4.21% S, 18 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
35S syn 87.32 d β 0.167 35Cl
36S 0.02% S, 20 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
Rough sulfur crystal
Sulfur crystalites at Waiotapu hot springs, New Zealand

మూలాలు

  1. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics (PDF). CRC press. 2000. ISBN 0849304814.
  2. "Sulfur History". Georgiagulfsulfur.com. Retrieved 2008-09-12.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  4. Sulfuric Acid Growth

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.