ఖమ్మం
ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం .
| ఖమ్మం ఖమ్మం మేట్టు | |
|---|---|
| పట్టణం | |
![]() నరసింహస్వామి గుట్ట నుంచి ఖమ్మం పట్టణం | |
![]() ఖమ్మం | |
| భౌగోళికాంశాలు: 17.25°N 80.16°E | |
| Country | India |
| State | Telangana |
| జిల్లా | Khammam |
| ప్రభుత్వం | |
| • సంస్థ | ఖమ్మం పురపాలక సంస్థ |
| • మేయర్ | గుగులోత్ పాపాలాల్ |
| • ఉప మేయర్ | బత్తుల మురళి |
| • పురపాలక కమీషనర్ | జి. వేణుగోపాల్ |
| • పార్లమెంట్ సభ్యులు | పొంగులేటి సుధాకర్ రెడ్డి |
| విస్తీర్ణం[1] | |
| • పట్టణం | 94.37 |
| • Urban | 40.40 |
| • Rural | 60.90 |
| • Metro | 60.70 |
| ప్రదేశ ర్యాంకు | 3rd (రాష్ట్రం) |
| ఎత్తు | m ( ft) |
| జనాభా (2011)[1] | |
| • పట్టణం | 3 |
| • ర్యాంకు | 150(India) 4th (Telangana) |
| • సాంద్రత | 3 |
| • మెట్రో | 1,58,000 |
| బాషలు | |
| • అధికారిక | తెలుగు, ఉర్దూ |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| పిన్ కోడ్ | 507001/02/03 |
| వాహన రిజిస్ట్రేషన్ | TS–04[2] |
| Ethnicity | Indian |
| Planning agency | Khammam Urban Development Authority |
| వెబ్‌సైటు | Khammam Municipal Corporation |
చరిత్ర
తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాచర్ల దొరలూ, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉన్నది 1905 దాకా వంరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ Khammamett గా పేర్కొనబడినది .[3]
చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము కమ్మమెట్టు" [4][5][6][7][8][9]. తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది.
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.
భౌగోళికము
ఖమ్మం భౌగౌళికముగా 17.25° ఉ 80.15° తూలో ఉంది.దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణము కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగ సాగర్ నీరు లభించింది.
పర్యాటక కేంద్రాలు
- ఖమ్మం ఖిల్లా
- నరసింహస్వామి ఆలయం
- శ్రీ జలాంజనేయస్వామి ఆలయం
- లకారం చెరువు
- దానవాయిగూడెం పార్కు
- తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
ప్రముఖులు
పట్టణంలోని నివాస ప్రాంతాలు
ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస మరియు వాణిజ్య ప్రాంతాలు.
|
|
|
|
ఇతర లంకెలు
మూలాలు
- "Basic Information". Official website of Khammam Municipal Corporation. Retrieved 18 February 2016.
- "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
- Nizam's Guaranteed State Railway 1870
- A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216
- A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
- Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149
- A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London
- The Geography of India, J. Burgess, 1871, London, p. 48
- The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73

