కోస్తా

కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని తీరప్రాంతము. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది.

తీరాంధ్ర
ప్రాంతం

భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతున్నది
దేశం India
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
విస్తీర్ణం[1]
  మొత్తం92,906
జనాభా (2011)
  మొత్తం3,41,93,868
భాషలు
  అధికారికతెలుగు
సమయప్రాంతంభాజాకా (UTC+05:30)
పెద్ద నగరంవిశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.

ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు (కోస్తా, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.

మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా

బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచింది.

కోస్తా ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.

మూలాలు

ఇంకా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.