కోట శ్రీనివాసరావు
కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[1][2]
| కోట శ్రీనివాసరావు | |
|---|---|
![]() కోట శ్రీనివాసరావు | |
| జననం | కోట శ్రీనివాసరావు 1942, జులై 10 కృష్ణా జిల్లా కంకిపాడు |
| వృత్తి | ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు |
| ప్రసిద్ధి | తెలుగు సినిమా నటుడు |
కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
సినీరంగ ప్రవేశం

బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.
అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది.
ప్రజాదరణ పొందిన కోట డైలాగులు
- ఈ డెవడ్రా బాబూ...
- నాకేంటి ..మరి నాకేంటి.
- మరదేనమ్మా నా స్పెషల్.
- అయ్య నరకాసుర.
- అంటే నాన్నా అది
పురస్కారాలు
- పద్మశ్రీ పురస్కారం - 2015 : 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుతం సత్కరించింది.[3]
నంది పురస్కారాలు
చిత్ర సమాహారం
తెలుగు సినిమాలు
2010లు2000లు
|
1990లు
1980లు
1970లు
|
మూలాలు
- http://ibnlive.in.com/news/telugu-actor-ks-raos-son-dies-in-accident/124928-8-69.html
- టోటల్ టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు ఇంటర్వ్యూ
- Telugu, Filmibeat. "కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు". Filmibeat. Filmibeat. Retrieved 16 April 2016.
