కొవ్వూరు

తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ మండలానికి చెందిన ఇదే పేరు గల గ్రామం కోసం కొవ్వూరు (కాకినాడ గ్రామీణ మండలం) చూడండి.

కొవ్వూరు రైల్వే స్టేషను
కొవ్వూరు బస్ స్టాండ్

కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. గోదావరి నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.

Disambiguation

పురాణ ప్రశస్తి

నేటి కాలంలో కొవ్వూరుగా ప్రసిధ్దమైన ఈ పుణ్యక్షేత్రం గోవూరు లేక గోష్పాద క్షేత్రంగా పిలువబడేది. గౌతమ మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్టు పురాణగాధలు వివరించాయి. గోదావరీ తీరాన ఉన్న 'గోపాదాల రేవు' ఆశేష జన సందోహాన్ని ఆకర్షిస్తుంది. పూర్వము ఒకసారి పదిహేను సంవత్సరాలు వర్షాభావంతో కరువు సంభవించింది. చాలామంది ప్రజలకు, మునులకు ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రమే సుభిక్షంగా ఉందని తెలిసింది. గౌతమ మహర్షి గాయత్రీ దేవిని ప్రార్థించగా ఆమె కృపతో ఒక రోజులో ఎంతమందిని అయినా పోషించగల బంగారు పాత్ర పొందగలిగాడు. తన తపో శక్తితో, గాయత్రీ మాత అనుగ్రహంతో ఉదయం పొలంలో విత్తనాలు చల్లితే సంధ్యా సమయానికి పంట వచ్చేది. గౌతమ మహర్షి ఆశ్రమం ఒక్కటే కరువు లేకుండా ఉండటం చూసి ఓర్వలేకపోయిన ఇతర మునులు ఒక మాయ గోవును సృష్టించి గౌతమ మహర్షి పొలంలోకి పంపినారు. మహర్షి ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు. అలికిడికి కళ్ళు తెరిచి చూడగా గోవు పంట తినుచున్నదని గ్రహించి దర్భతో అదిలించాడు. మాయాగోవు కావున అది కొంచెం దూరం పారిపోయి వేదన అనుభవించి మృతి చెందింది. గోహత్యాపాతకం పోవాలంటే పవిత్ర గంగానదిని ప్రవహింపచేయాలని అందరు నిశ్చయించారు. గౌతమ మహర్షి తపస్సు చేసి మహా శివుని అనుమతితో గంగను తీసుకొని వచ్చాడు. గంగను విడుచునప్పుడు మహా శివుని షరతు ఏమనగా గౌతముడు వెనుతిరిగి చూడరాదు. అఖండ గోదావరి నాశిక్, త్రయంబకేశ్వరం నుంచి బాసర, ధర్మపురి, భద్రాచలం మీదుగా గోవూరులో ప్రవేశించింది. గౌతముడు నీటి శబ్దం వినిపించుటలేదు అని వెనుతిరిగి చూడగా ఆ ప్రదేశంలో అఖండ గోదావరి పాయలుగా విడిపోయింది. దేవి పురాణం ప్రకారం, పార్వతీ దేవి సవతి పోరుని దూరం చేసుకొనుటకు ఒక మాయ ఆవును సృష్టించి తపమాచరించుచున్న గౌతమ మహర్షి దగ్గరకి పంపగా తపోభంగం కలిగిన మహర్షి ఆ అవును తన తపశ్శక్తితో ధగ్దం చేశాడు. గోహత్యాపాతకం తనకంటకండా ఉండాలంటే దివి నుండి గంగను తీసుకువచ్చి ఆ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింపచేయాలని చెప్పిన పార్వతీ దేవి ఆనతి మేర గౌతముడు తపస్సు చేసి గంగను దివి నుండి భువికి తెప్పించాడు. ఆ హిమగంగ పారిన ప్రదేశమే గోష్పాద క్షేత్రంగా, ఆ గంగే గౌతమి (గోదావరి) గా ప్రసిద్ధి చెందాయి. మరణించిన గోవును గోదావరి నదీ ప్రవాహంతో పునరుజ్జీవితుల్ని చేశారు. [1]

గ్రామం పేరు వెనుక చరిత్ర

గోదావరి ఒడ్డున కొవ్వూరు

కొవ్వూరు పేరు బ్రిటిషు వారు భారత దేశాన్ని పాలించడానికి మునుపు గోవూరుగా ఉండేది. కాలక్రమంలో అది కొవ్వూరుగా మారింది. గోవు సంచరించిన ప్రాంతం కాబట్టి, గోవూరు అయింది. పశువు వేదన పడిన ప్రదేశం "పశువేదన"గా పేరుగాంచి, కాలక్రమంలో "పశివేదల"గా రూపాంతరం చెందింది. అఖండ గోదావరి పాయలుగా విడిపోయిన ప్రాంతం విగ్నేశ్వరంగా పేరు. కాలక్రమంలో అది విజ్జేశ్వరంగా మారింది. [1]

ప్రముఖులు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

అంతేకాకుండా కొవ్వూరులోనే చాలా పురాతనమైన విద్యాపీఠము ఆంధ్రగీర్వాణవిద్యాపీఠము. ఇది 1902లో నిర్మింపబడింది. ఈ ఆంధ్రగీర్వాణవిద్యాపీఠమునందు శ్రీ వాడ్రేవు జోగమ్మ వేదసంస్కృత కళాశాల, శ్రీమావులేటి సోమరాజు సంస్కృతోన్నతపాఠశాలలు ఇప్పటికి నడుపబడుచున్నవి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం వరకు గోదావరి పై కట్టిన మూడు వంతెనలు ఇక్కడి ప్రత్యేకత. సుమారు నూరు సంవత్సరాల క్రితము సర్. ఆర్థర్ కాటన్ కట్టించిన రైలు వంతెన ఇప్పటికి చెక్కుచెదరకండా ఉండటం విశేషం. పన్నెండు వత్సరములకొక సారి వచ్చే గోదావరి పుష్కరములందు దేశపు నలుమూలల నుండి ఆశేష భక్తజనం ఈ గోష్పాద క్షేత్రమును దర్శించి, పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తారు.

శాసనసభ నియోజకవర్గం

దృశ్యమాలిక

    మూలాలు

    1. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు- వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35. line feed character in |title= at position 63 (help); Check date values in: |date= (help)
    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.