కొరాపుట్
కొరాపుట్ (Koraput) ఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు కొరాపుట్ జిల్లా కేంద్రం. జైపూర్ సంస్థానం మరియు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకి వాయువ్య (North West) సరిహద్దుగా ఉంది.
| కొరాపుట్ Koraput | |
|---|---|
| జిల్లా | |
![]() కోరాపుట్ జిల్లా లోని లక్ష్మీపూర్ రైలుమార్గం వద్ద దృశ్యం | |
![]() Location in Odisha, India | |
| భౌగోళికాంశాలు: 18.8083°N 82.7083°E | |
| దేశం | India |
| రాష్ట్రం | ఒడిషా |
| Established | 1936 |
| ముఖ్యపట్టణం | కొరాపుట్ |
| ప్రభుత్వం | |
| • కలక్టరు | సచిన్ ఆర్. జాదవ్, IAS |
| • లోక్ సభ సభ్యుడు | జయరాం పంగి, బిజూ జనతా దళ్ |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 8,379 |
| జనాభా (2001) | |
| • మొత్తం | 11,77,954 |
| • సాంద్రత | 140.58 |
| భాషలు | |
| • అధికారిక | ఒరియా, ఇంగ్లీషు |
| • ఇతర ముఖ్యమైన | తెలుగు |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| PIN | 764 xxx |
| వాహన రిజిస్ట్రేషన్ | OD-10 |
| Sex ratio | 1.038 ♂/♀ |
| Literacy | 36.20% |
| లోక్ సభ నియోజకవర్గం | కొరాపుట్ |
| Vidhan Sabha constituency | 5 |
| Climate | Aw (Köppen) |
| Precipitation | 1,522 millimetres (59.9 in) |
| Avg. summer temperature | 38 °C (100 °F) |
| Avg. winter temperature | 12 °C (54 °F) |
| వెబ్‌సైటు | www |
చరిత్ర
కొరాపుట్ జిల్లా ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, నలులు, గంగా రాజులు మరియు ఇతర సూర్యవంశ రాజులు పరిపాలించారు. ఇది ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1936 ఏప్రిల్ 1 తేదీన ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఇదొక జిల్లాగా మారింది.
1992 అక్టోబరులో ఈ జిల్లాను విభజించి; మల్కనగిరి, రాయగడ మరియు నవరంగపూర్ లను ఏర్పరచారు.
ఈ జిల్లా ప్రస్తుతం రెడ్‌కారిడార్గా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల్ని పొందుతున్నది.[1]
జనాభా గణాంకాలు
- 2001 లెక్కల ప్రకారం[2], కొరాపుట్ పట్టణం జనాభా 39,523. వీరిలో పురుషులు 52% మరియు స్త్రీలు48%. ఇక్కడి సగటు అక్షరాస్యత 68%, జాతీయ సగటు కన్నా ఎక్కువ. కొరాపుట్ జనాభాలో 12% మంది చిన్న పిల్లలు.
- 2011 జనాభా లెక్కలు ప్రకారం కొరాపుట్ జిల్లా జనాభా of 1,376,934,[3] ఇది భారతదేశంలో 356వ ర్యాంకులో ఉన్నది (మొత్తం జిల్లాలు-640]]).[3] ఇక్కడి జనసాంధ్రత 156/చ.కి.మీ.[3] దీని జనాభా వృద్ధి రేటు 2001-2011 కంటే 16.63% ఎక్కువ.[3] కొరాపుట్ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1031 స్త్రీలు ఉన్నారు,[3] మరియు ఇక్కడి అక్షరాస్యత రేటు 49.87 %.[3]
భౌగోళికం
మేజర్ పట్టణాలు
- జయపూర్
- కోరాపుట్
- సునాబెడా
- డామన్‌జాబ్
- సెమిలిగుడా
- కాట్పాడి
- బొరిగుమ్మా
విభాగాలు
- కోరాపుట్ జిల్లా 2 ఉపవిభజన మరియు 14 బ్లాక్స్ విభజించబడింది. 2 ఉప విభాగాలు కోరాపుట్, జయపూర్ ఉంటాయి
- కోరాపుట్ ఉపవిభజన మండలాలు : 1. కోరాపుట్ 2. సెమిలిగుద 3.నందపుర్ 4. పొత్తంగి 5. దస్మంథ్పుర్ 6. లంతపుత్ 7. లక్ష్మిపూర్ 8. నారాయణపత్న 9. బందుగఒన్
- జయపూర్ ఉపవిభజనలో మండలాలు: 1. జయపూర్ 2. భొఇపరిగుద 3. కొత్పద్ 4. కుంద్రా 5. బొరిగుమ
సంస్కృతి
స్థలాలను
- ఘుప్తెస్వర్ శివ్ దేవాలయం
- జగన్నాథ్ ఆలయం (కోరాపుట్)
- ఉన్నత ఖొలబ్ బొటానికల్ గార్డెన్
- మాలిగుడా టన్నెల్
- దుడుమ జలపాతం
- భరినిపుత్
- డెఒమలి హిల్
- భతిసిణసన & గణేష్ ఆలయం
- మాతా కాంటా భౌసుని పీట డమంజొది
- జైన్ టెంపుల్ సుబై ణందపుర్
- పాడువా టౌన్
- మాతా శితల ఆలయం ఖోట్ఫాడ్
- డమయంత్య్ సాగర్ ఖోట్ఫాడ్
- డెఒద శివ టెంపుల్, ఖోట్ఫాడ్ యొక్క ఛందిలి ఘ్.ఫ్
- దమొంజొది కొండ వద్ద
ప్రజలు

కోరౌట్ జిల్లాలో ఆదివాసీ ప్రజలు అధికంగా ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కొక భాష మరియు ఒక్కొక ప్రత్యేక సంరదాయం ఉంది. గిరిజనులకు వారి వారి ప్రత్యేక మతాచారాలు ఉన్నాయి. వీరు దేశ గణాంకాలలో తమను హిందువులుగా నమోదు చేసుకుంటున్నారు. అందువలన వీరు క్రమంగా హిందూ ప్రవాహంలో కలిసి పోతున్నారు. గిరిజనుల మీద మతపరంగా హిందువులు మరియు క్రైస్తవులు ఒకే కాలంలో దాడి సాగించారు.
వ్యవసాయం
కోరాపుట్ జిల్లాలోని జైపోర్ భూభాగం వరి పంటకు ఆరంభ భూభాగంగా భావిస్తున్నారు. కోరౌట్ ఆఫివాసీ ప్రజలు పలు జాతుల వరి పంటను ఉత్పత్తు చేసి పండిస్తున్నారు. వీరు ఆరిన భూభాగం మరియు చిత్తడి నేలలలో పండించగల వరిపంటను పండిస్తున్నారు. 2012లో " ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " కోరాపుట్ ప్రజల సేవలను గుర్తించి ఫుడ్ సెక్యూరిటీని మంజూరు చేసింది. Global Agricultural Heritage Site
ఆర్ధికం
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కోరాపుట్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి[4]
- హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - సునబెడా
- నేషనల్ అల్యూమినియం కంపెనీ ( నాల్కో) - దమంజొడి
- బిట్-జయపూర్
- కొలాబ్ జలవిద్యుత్ స్టేషను
- మచ్కుండ్ - జలవిద్యుత్ స్టేషను
కళాశాలలు
- 1. గతంలో ఎ.సి.ఎ. అని పిలుస్తారు ఏరోనాటిక్స్ కళాశాల, కాలేజ్ (1981 లో స్థాపించబడింది)
- 2. వ్యోమయానా సమస్థ విద్యాలయ (1968 లో స్థాపించబడింది)
- 3. డి.ఎ.వి కాలేజ్, కోరాపుట్ (1981 ఆగస్టు 10 న స్థాపించబడింది)
- 4. విక్రమ్ దేవ్ కాలేజ్ జయపూర్ (1947 లో స్థాపించబడింది)
- 5. ఇంజనీరింగ్ & టెక్నాలజీ గోపాల్ కృష్ణ కాలేజ్ (సంవత్సరంలో స్థాపించబడిన 1989)
- 6. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ & మేనేజ్మెంట్, జయపూర్
- 7. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (హెచ్.ఐ.ఐ.టి ), జయపూర్ యొక్క హెచ్.ఐ- టెక్ ఇంస్టిట్యూట్
- 8. ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, జయపూర్ యొక్క జయపూర్ పాఠశాల
- 9. టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సమంత చంద్ర శేఖర్ ఇన్స్టిట్యూట్ (2001 లో స్థాపించబడింది)
- 10.భైరబ మహావిద్యాలయ కాలేజ్, బొరిగుమ్మ. ఒడిషా, కోరాపుట్
- 11.సెంట్రల్ విశ్వవిద్యాలయం
- 12. కోట్‌పాడ్ కాలేజ్, కోట్‌పాడ్ .
- 13. మా సంతోషి సంస్కృత కళాశాల,కోట్‌పాడ్
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 1,376,934,[3] |
| ఇది దాదాపు. | స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
| అమెరికాలోని. | హవాయి నగర జనసంఖ్యకు సమం.[6] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 356వ స్థానంలో ఉంది..[3] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 156 [3] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 16.63%.[3] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 1031:1000 [3] |
| జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
| అక్షరాస్యత శాతం. | 49.87%.[3] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అతి స్వల్పం |
భాషలు
నక్సలిజం
దక్షిణ ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలలో 2000 నుండి నక్సలిజం ఆలోచించవలసి విషయం. ఆరంభంలో పరిసర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మల్కనగిరిలో నక్సలిజం ఆరంభం అయింది. తరువాత నక్సలిజం కోరాపుట్ జిల్లా మరియు రాయగడ, నబరంగ్‌పుర్ జిల్లాలకు వ్యాపించింది. కొండలు మరియు దట్టమైన భూభాగం, అభివృద్ధి పనులు తక్కువగా ఉండడం, గిరిజనులు మరియు పేదల దుస్థితి మరియు నిర్వహణా లోపం నక్సలిజం బలపడడానికి కారణంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలో నక్సలైటుల దాడి తరువాత ఈ ప్రాంతంలో నక్సలైటు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. .[9] పీ పుల్స్ వార్ గ్రూపుకు చెందిన నక్సలైట్లు ఈ ప్రాంతంలోని జిల్లాలల మీద పలు దాడులు (రైతులు, పోలీస్, పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు మరియు గోడౌన్లు ) జరిపారు.[10]
రాజాకీయాలు
అసెంబ్లీ నియోజకవర్గం
The following is the 5 Vidhan sabha constituencies[11][12] of Koraput district and the elected members[13] of that area
| No. | Constituency | Reservation | Extent of the Assembly Constituency (Blocks) | Member of 14th Assembly | Party |
|---|---|---|---|---|---|
| 141 | లక్ష్మీపూర్ | షెడ్యూల్డ్ తెగలు | లక్ష్మీపూర్, దసమంతపూర్, బంధుగావ్, నారాయణపతనా. | ఝిన హికల | బి.జెడి |
| 142 | కొట్పాడ్ | షెడ్యూల్డ్ తెగలు | కోట్పాడ్ (ఎన్.ఎ.సి), కోట్పాడ్, కుంద్రా, బొరిగుమ్మా (భాగం)
, Boipariguda (part) |
బసుదేవ్ మఝి/శ్రీ చంద్ర శేఖర్మఝి (ప్రస్తుత ఎం.ఎల్.ఎ) | ఐ.ఎన్.సి |
| 143 | జైపూర్ | లేదు | జెఉపోర్ (ఎం), జెయ్పోర్, బొరిగుమ్మ (భాగం) | రబి నారాయణ్ నందా | బి.జె.డి |
| 144 | కొరాపుట్ | షెడ్యూల్డ్ కులాలు | కొరాపుట్ (ఎన్.ఎ.సి), సునబెడా (ఎన్.ఎ.సి), లాంప్తపుట్, కోరౌట్ (భాగం) ,బొయిపరిగుడా (భాగం) | రఘురాం పాడల్ | BJD |
| 145 | పొట్టంగి | షెడ్యూల్డ్ తెగలు | పొట్టంగి, సెమిలిగుడా, నందాపూర్, కోరాపుట్ (భాగం) | రామా చంద్ర కడం | ఐ.ఎన్.సి |
మూలాలు
- "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
- "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Swaziland 1,370,424
line feed character in|quote=at position 10 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
line feed character in|quote=at position 7 (help) - M. Paul Lewis, ed. (2009). "Bhatri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
- M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: Extra text (link)
- "Maoists in Orissa Growing Tentacles and a Dormant State".
- "Naxalite Consolidation In Orissa".
- Assembly Constituencies and their EXtent
- Seats of Odisha
- "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013.
MEMBER NAME





