కొమరవోలు (పామర్రు)
కొమరవోలు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.521 322., ఎస్.టి,డి.కోడ్ = 08674.
| కొమరవోలు (పామర్రు) | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() కొమరవోలు (పామర్రు) |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.368401°N 80.982272°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీమతి కళ్ళేపల్లి సంపత్ కుమారి |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,230 |
| - పురుషుల సంఖ్య | 1,098 |
| - స్త్రీల సంఖ్య | 1,132 |
| - గృహాల సంఖ్య | 675 |
| పిన్ కోడ్ | 521322 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
- గ్రామ శివారు గాంధీ ఆశ్రమం, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
- ఆర్.సి.ఎం.ప్రాథమిక పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
- ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ కేంద్రం జమిగొల్వేపల్లి ప్రాథమీక అరోగ్య కేంద్రం పరిధిలో ఉంది.
- వీధిదీపాలు:- ఈ గ్రామములో ఉన్న మొత్తం 210 విద్యుత్తు స్తంభాలకు, ఒక్కొక్కటీ మూడువేల రూపాయలు ఖరీదుచేసే, ఎల్.ఇ.డి.దీపాల ఏర్పాటు ప్రారంభించారు. దీనివలన 50 నుండి 60% విద్యుత్తు అదా కాగలదు. [4]
- పారిశుధ్యం:- ఈ గ్రామములో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినది. [4]
- విద్యుత్తు:- 3,000 మంది గృహ వినియోగదారులు, 400 మంది వ్యవసాయ వినియోదారులు ఉన్న ఈ గ్రామములో, 1.2 కోట్ల రూపాయలతో ఒక 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినది. దీనివలన ఈ గ్రామముతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలకు గూడా నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]
గ్రామానికి సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పొట్లూరి కృష్ణకుమారి సర్పంచిగా ఎన్నికయ్యారు. ఉపసర్పంచిగా శ్రీమతి కళ్ళేపల్లి సంపత్ కుమారి ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ అమరలింగేశ్వర,దుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)
ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయుటకై 38.40 లక్షల రూపాయల నిధులు మంజూరయినది. ఈ నిధులతో ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ముఖమండపం ఏర్పాటు, వాహనశాల, వాహనశాల ప్రదర్శన సప్త, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టినారు. [6]
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను, 2016,ఫిబ్రవరి-9వ తేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధులలో పోతురాజు గడలను, ఘటాలను డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమాతాధన నిర్వహించారు. [5]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
శ్రీ యెర్నేని సుబ్రహ్మణ్యం స్వాతంత్ర్య సమరయోధులు.
గ్రామ విశేషాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి, తన అమ్మమ్మగారి గ్రామమైన ఈ గ్రామాన్ని, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [3]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,230 - పురుషుల సంఖ్య 1,098 - స్త్రీల సంఖ్య 1,132 - గృహాల సంఖ్య 675;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2585.[3] ఇందులో పురుషుల సంఖ్య 1302, స్త్రీల సంఖ్య 1283,గ్రామంలో నివాసగృహాలు 675 ఉన్నాయి.
మూలాలు
- http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Komaravolu". Retrieved 29 June 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా, 2014,జులై-31; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-7; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016,జనవరి-25; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-10; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-10; 1వపేజీ.
