కొబ్బరిపీచు
కొబ్బరిపీచు కొబ్బరికాయలో ఉండే పీచు ద్వారా సేకరించబడుతుంది. ఇది తాళ్ళు, బ్రష్షులు, పరుపులు, గుమ్మంబయట కాళ్ళు తుడ్చుకునే గుడ్డ మొ॥ తయారు చేసేందుకు వాడబడుతుంది. సాంకేతికంగా కొబ్బరి చిప్ప నుండి, కొబ్బరి కాయ ఉపరితలం మధ్య ఉన్నదే పీచు. ఉద్యాన అభివృద్ధిలో, కూలర్ లకు, కార్లు, ఇళ్ళకు తెరలుగా వాడెందుకు కూడా ఉపయోగించవచ్చు.[1]

కొబ్బరిపీచు గుట్టగా పోసిన చిత్రం

కొబ్బరిపీచును వేరుచేస్తున్న కార్మికులు

కొబ్బరిపీచు యొక్క వివిధ రూపాంతరాలు
కొబ్బరి పీచు పేరు వెనుక చరిత్ర
ఆంగ్లములో దీనిని 'coir' గా పిలుస్తారు. ఈ పదము మలయాళ (കയർ ) మరియు తమిళ (கயிறு ) పదమైన 'కాయిర్ ' నుండి ఉద్భవించింది. [2]
చరిత్ర
ప్రాచీనకాలం నుండే కొబ్బరిపీచుతో తాళ్ళు, మోకులు తయారుచేసి వాడుకునే పద్ధతి ఉంది. మలేసియా, జావా, సుమత్రా, చైనా మరియు అరబ్బు దేశాలకు పడవలలో తాళ్ళకు పీచును వాడారు. 11వ శతాబ్దం నాటి అరబ్బు సాహిత్యంలో భారతీయ నావికుల ద్వారా విస్తృత స్థాయిలో కొబ్బరి పీచుతో చేసిన తాళ్ళ వాడకం గురించి కనిపిస్తుంది.[3]
మూలాలు
- How coir is made - material, making, history, used, processing, product, industry, machine, History
- కోకోనట్
- Staff. "About Coir". Coir Board, Govt. of India. Retrieved 17 March 2013.
బయటి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.