కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం (వ్యక్తిగతం)
వ్యస్థాపితం 1954
మొదటి బహూకరణ 1955
క్రితం బహూకరణ 2014
బహూకరించేవారు కేంద్ర సాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వం
వివరణ భారతీయ సాహిత్య పురస్కారం

చరిత్ర

కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు కలిపి మొత్తం 22 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తొలి పురస్కారాన్ని 1955 ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటుగా అందజేసే నగదు బహుమతిని ప్రారంభించినప్పుడు రూ.5వేలుగా ఉండగా క్రమంగా ఆ మొత్తాన్ని పెంచారు. 1983లో రూ.10వేలు, 2001లో రూ.40వేలు, 2003లో రూ.50వేలుగా బహుమతి మొత్తాన్ని పెంచారు. 2009 నుంచి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష చొప్పున బహుమతిని అందజేస్తున్నారు.

సాహిత్య అకాడమీ ఇతర పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా కొన్ని ఇతర పురస్కారాలను కూడా ఏర్పాటుచేశారు. ఇతర పురస్కారాల నుంచి వేరుగా గుర్తించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రధాన పురస్కారంగా వ్యవహరిస్తుంటారు. సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు అకాడమీ ప్రకటించే ఇతర పురస్కారాలు:

  • భాషా సమ్మాన్ పురస్కారం : సాహిత్య అకాడమీ సంస్థ గుర్తించిన ఇతర భాషలలో సాహిత్యసృజన, సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
  • సాహిత్య అకాడమీ అనువాద బహుమతి : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో అనువాద రచనలు చేసిన వారికి ప్రకటిస్తారు.
  • సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లోని ఉత్తమ బాలసాహిత్యానికి/బాలసాహిత్యానికి సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
  • సాహిత్య అకాడమీ యువ పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ప్రకటిస్తారు.

పురస్కారాల ప్రాతిపదిక

నిబంధనలు

  1. ఈ అవార్డు కొరకు పుస్తకం అది వ్రాయబడిన భాషలో విశేషమైనదిగా గుర్తింపబడాలి. ఈ పుస్తకం క్రొత్తగా సృష్టింపబడినది గానీ లేదా విశేషమైన కృషితోగాని వ్రాయబడినదై ఉండాలి. కానీ అనువాదం,

భాషలు

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు

సంవత్సరంపుస్తకంసాహితీ విభాగంరచయిత
2018విమర్శినివ్యాసాలుకొలకలూరి ఇనాక్
2017గాలిరంగుకవిత్వందేవిప్రియ
2016రజనీగంధ - కవితా సంకలనంకవిత్వంపాపినేని శివశంకర్
2015విముక్త -కథానికలుకథవోల్గా
2014మన నవలలు-మన కథానికలువిమర్శా వ్యాసాల సంకలనంరాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
2013సాహిత్యాకాశంలో సగంతెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనంకాత్యాయని విద్మహే[1]
2012పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలుకథా సంకలనంపెద్దిభొట్ల సుబ్బరామయ్య
2011ఉగ్గుపాలుపిల్లల కథలుఎం. భూపాల్ రెడ్డి
2010కాలుతున్న పూలతోటనవలసయ్యద్ సలీమ్
2009ద్రౌపదినవలయార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
2008పురుషోత్తముడుపద్యరచనచిటిప్రోలు కృష్ణమూర్తి
2007శతపత్రంఆత్మకథగడియారం రామకృష్ణ శర్మ
2006అస్తిత్వనదం ఆవలి తీరానచిన్న కథమునిపల్లె రాజు
2005తనమార్గంకథా సంకలనంఅబ్బూరి ఛాయాదేవి
2004కాలరేఖలునవలఅంపశయ్య నవీన్
2003శ్రీ కృష్ణ చంద్రోదయముపద్యరచనఉత్పల సత్యనారాయణాచార్య
2002స్మృతి కిణాంకంవ్యాసాలుచేకూరి రామారావు
2001హంపీ నుంచి హరప్పా దాకఆత్మకథతిరుమల రామచంద్ర
2000కాలాన్ని నిద్ర పోనివ్వనుపద్యరచనఆచార్య ఎన్.గోపి
1999కథాశిల్పంవ్యాసాలువల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998బలివాడ కాంతారావు కథలుకథలుబలివాడ కాంతారావు
1997స్వప్నలిపికవితఅజంతా (పి. వి. శాస్త్రి)
1996కేతు విశ్వనాథ రెడ్డి కథలుకథలుకేతు విశ్వనాథరెడ్డి
1995యజ్ఞంతో తొమ్మిదికథలుకాళీపట్నం రామారావు
1994కాలరేఖవిమర్శగుంటూరు శేషేంద్రశర్మ
1993మధురాంతకం రాజారాం కథలుకథలుమధురాంతకం రాజారాం
1992హృదయనేత్రినవలమాలతీ చందూర్
1991ఇట్లు మీ విధేయుడుకథలుభమిడిపాటి రామగోపాలం
1990మోహనా ఓ మోహనాకవితకె.శివారెడ్డి
1989మణిప్రవాళమువ్యాసాలుఎస్.వి.జోగారావు
1988అనువాద సమస్యలువిమర్శరాచమల్లు రామచంద్రారెడ్డి
1987గురజాడ గురుపీఠంవ్యాసాలుఆరుద్ర
1986ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావంసాహితీ విమర్శఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985గాలివానకథలుపాలగుమ్మి పద్మరాజు
1984ఆగమ గీతికవితఆలూరి బైరాగి
1983జీవనసమరంవ్యాసాలురావూరి భరద్వాజ
1982స్వర్ణ కమలాలుకథలుఇల్లిందుల సరస్వతీదేవి
1981సీతజోస్యంనాటకంనార్ల వెంకటేశ్వరరావు
1979జనప్రియ రామాయణంకవిత్వంపుట్టపర్తి నారాయణాచార్యులు
1978కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు)కవిత్వం, నాటకాలుదేవులపల్లి కృష్ణశాస్త్రి
1977కుందుర్తి కృతులుకవిత్వంకుందుర్తి ఆంజనేయులు
1975గుడిసెలు కూలిపోతున్నాయికవిత్వంబోయి భీమన్న
1974తిమిరంతో సమరంకవిత్వందాశరథి
1973మంటలు మానవుడుకవిత్వంసి.నారాయణరెడ్డి
1972శ్రీశ్రీ సాహిత్యముకవిత్వంశ్రీశ్రీ
1971విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్యవ్యాఖ్యానంతాపీ ధర్మారావు
1970అమృతం కురిసిన రాత్రికవిత్వందేవరకొండ బాలగంగాధర తిలక్‌
1969మహాత్మకథకవిత్వంతుమ్మల సీతారామమూర్తి
1965మిశ్రమంజరికవిత్వంరాయప్రోలు సుబ్బారావు
1964క్రీస్తుచరిత్రకవిత్వంగుర్రం జాషువా
1963పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామానవలత్రిపురనేని గోపీచంద్
1962విశ్వనాథ మధ్యాక్కరలుకవిత్వంవిశ్వనాథ సత్యనారాయణ
1961ఆంధ్ర వాగ్గేయకార చరిత్రముజీవిత చరిత్రబాలాంత్రపు రజనీకాంతరావు
1960నాట్యశాస్త్రముచరిత్రపి.ఎస్.ఆర్. అప్పారావు
1957శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్రజీవిత చరిత్రచిరంతానందస్వామి
1956భారతీయ తత్వశాస్త్రముపరిశోధనబులుసు వెంకటేశ్వర్లు
1955ఆంధ్రుల సాంఘిక చరిత్రముచరిత్రసురవరం ప్రతాపరెడ్డి

1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.