కెల్విన్‌

కెల్విన్ (Kelvin (symbol: K) ఉష్ణోగ్రత యొక్క కొలమానము మరియు ఏడు మూల SI ప్రమాణాలలో ఒకటి. కెల్విన్ కొలమానం ఉష్ణగతిశాస్త్ర ప్రకారం శూన్యం అనగా ఎటువంటి ఉష్ణ శక్తి లేకపోవడం (0 K). కెల్విన్ కొలమానం మరియు కెల్విన్ లు ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజినీరు విలియం థాంసన్, మొదటి బరోన్ కెల్విన్ (William Thomson, 1st Baron Kelvin ( (1824–1907) పేరు మీద నామకరణం చేయబడింది. ఇతడు పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) కనుగొనేందుకు ప్రయత్నించాడు. కెల్విన్‌ కొలమానంలో ఉదాహరణకి, పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం 0 K అని రాస్తారు తప్ప 0°K అని రాయకూడదు. అనగా కెల్విన్ కొలమానం వాడేటప్పుడు డిగ్రీలని సూచించే చిన్న సున్నని రాయనక్కర లేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఉన్న ఆచారం.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.